కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఫిబ్రవరి 1న 2021 బడ్జెట్ ను పార్లమెంటులో ప్రవేశ పెట్టింది. ఈ బడ్జెట్ ప్రసంగంలో విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న మొబైల్, ఏసీలు, ఫ్రిజ్‌ల విడిభాగాలపైన 2.5శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఆయా ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు 1 నుండి 2 శాతం వరకూ పెరగవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. అలాగే ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులపై కస్టమ్స్‌ డ్యూటీ 5 నుంచి 10 శాతం పెంచుతున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌లో పేర్కొన్నారు.(ఇది చదవండి: కొత్త ఆండ్రాయిడ్ 12లో అదిరిపోయే ఫీచర్స్!)

మొబైల్ ఛార్జర్లపై సుంకాన్ని 15 నుంచి 30 శాతానికి, మదర్‌బోర్డ్‌లపై సుంకాన్ని 10 నుంచి 20 శాతానికి పెంచడంతో పాటు మొబైల్‌ ఫోన్లకు ఇస్తున్న 10 శాతం సర్వీస్‌ వెల్ఫేర్‌ సెస్‌ మినహాయింపును కూడా ఈసారి రద్దు చేశారు. ఇంతకముందు మొబైల్ ఫోన్‌లలో ఉపయోగించే లిథియం అయాన్ బ్యాటరీల తయారీకి అవసరమైన భాగాలు, ఉప భాగాలపై ఎటువంటి పన్ను విధించలేదు. కానీ, ఇప్పుడు 2.5 శాతం సుంకాన్ని విధిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే రిఫ్రిజిరేటర్లు, ఏసీల్లో కీలకంగా వాడే కంప్రెషర్‌పై 2.5 శాతం, ఎలక్ట్రిక్ మోటార్లపై 10-15 శాతం కస్టమ్స్ డ్యూటీ పెంచారు.

దీంతో ఎలక్ట్రానిక్ విడిభాగలపై సుంకం విధించడాన్ని ఎలక్ట్రానిక్స్‌ పరిశ్రమ తీవ్రంగా వ్యతిరేకించింది. తమ ప్రతిపాదనలకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నారని ఇండియా సెల్యులార్, ఎలక్ట్రానిక్స్‌ అసోసియేషన్‌ (ఐసీఈఏ) చైర్మన్‌ పంకజ్‌ మొహింద్రూ, సీఈఏఎంఏ అధ్యక్షుడు కమల్‌నంది అన్నారు. అయితే కేంద్ర ఆర్దిక మంత్రి మాత్రం దేశీయంగా మొబైల్, ఏసీలు, ఫ్రిజ్‌లు, ఎలక్ట్రానిక్‌ పరికరాలు, సెమీకండక్టర్ల తయారీని ప్రోత్సహించేందుకు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై సుంఖం విధించినట్లు పేర్కొన్నారు.

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్(YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here