వాహనదారులకు శుభవార్త చెప్పింది కేంద్రం. కోవిడ్ -19 మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని 2021 మార్చి 31 వరకు డ్రైవింగ్ లైసెన్స్ (డీఎల్), రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (ఆర్‌సీ), పర్మిట్ల వంటి మోటారు వాహన పత్రాల గడువును పొడగించినట్లు కేంద్రం పేర్కొంది. ఫిబ్రవరి 1, 2020తో ముగుస్తున్న అన్ని పత్రాలకు ఈ పొడిగింపు వర్తిస్తుంది అని తెలిపింది. ఇప్పటికే కేంద్రం గతంలో 2020 మార్చి 30, జూన్ 9, ఆగస్టు 24 తేదీల వరకు పొడగించింది. చివరిగా వాహనాల రిజిస్ట్రేషన్లను డిసెంబర్ 31, 2020 నాటికి పూర్తి చేసుకోవాలని కోరింది.
ఇంకా చదవండి: 2020లో దేశంలో నిషేదింపబడిన టాప్ 5 పాపులర్ యాప్స్ ఇవే!
తాజాగా కొత్త కరోనా వైరస్ విజృంభిస్తున్న కారణంగా గడువును మార్చి 31,2021 తేదీ వరకు పొడగిస్తూ కేంద్ర రోడ్డు ట్రాన్స్ పోర్ట్ హైవే అథారిటీ నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి1,2020 నాటికి ముగిసినా వాహనాల రిజిస్ట్రేషన్ల గడువుపై కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో ఆ రిజిస్ట్రేషన్ల గడువు 2021 మార్చి 31 వరకు కొనసాగానున్నాయి. ప్రస్తుత పరిస్తితుల కారణంగా సామాజిక దూరాన్ని కొనసాగిస్తూ, రవాణా సంబంధిత సేవలను పొందటానికి ఇది సహాయపడనుంది. పౌరులు గృహ అవసరాల కోసం వస్తువుల కొనుగోలు, సరఫరా కోసం ఈ చర్యలు సహకరించనున్నట్లు పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాలలో కూడా లాక్-డౌన్ కారణంగా వివిధ పత్రాల గడువును పునరుద్ధరించాయి. కోవిడ్ -19 మహమ్మారి సమయంలో పౌరులు ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండటానికి ఇటీవల కేంద్రం అన్ని రాష్ట్రాలు, యుటీలను కోరింది.
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్(YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.
[…] […]
[…] […]