దేశంలో కరోనా వైరస్ తీవ్రంగా పెరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు బయటపడుతున్న కేసులలో ఎక్కువగా 18 – 45 ఏళ్ల లోపు గల వారి సంఖ్య అధికంగా ఉంది. అయితే వీరికి కూడా వ్యాక్సిన్ ఇచ్చేందుకు కేంద్రం సిద్దం అయ్యింది. ఏప్రిల్ 28 నుంచి 18 నుంచి 45 ఏళ్ల లోపు వారు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కేంద్రం సూచించింది. అయితే, నిన్న ప్రారంభమైన వ్యాక్సిన్ కోసం సాయంత్రం 4 గంటలకు ఒక్కసారిగా రిజిస్ట్రేషన్ కోసం ప్రయత్నించగా రద్దీ కారణంగా నమోదు రిజిస్ట్రేషన్ చేసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి.

18 నుంచి 45 ఏళ్ల లోపు వారికి వ్యాక్సినేషన్‌ కోసం ఆన్‌లైన్‌లో అపాయింట్‌మెంట్‌ తప్పనిసరి చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే దేశవ్యాప్తంగా ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ కోసం ప్రజలు ఒక్కసారిగా ప్రయత్నించడంతో కోవిన్‌ పోర్టల్‌ క్రాష్‌ అయ్యింది. ఆరోగ్య సేతు, ఉమంగ్‌ యాప్‌లోనూ ఇలాంటి సమస్యను ఎదుర్కొన్నారు. కోవిన్‌ సైట్‌ పై నిమిషానికి దాదాపు 27 లక్షల హిట్లు వచ్చాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రాలు, ప్రైవేటు టీకా కేంద్రాలు అందుబాటులో ఉంచిన స్లాట్ల ఆధారంగా టీకా సమయాన్ని కేటాయిస్తామని ప్రభుత్వ అధికారులు తెలిపారు. అయితే కొద్దిగంటల తర్వాత కోవిన్‌ పోర్టల్‌పై లోడ్‌ తగ్గిన అనంతరం ప్రజలు తమపేరు నమోదు చేసుకొని స్లాట్‌ బుకింగ్‌ కోసం అక్కడ కూడా వారికి నిరాశ ఎదురైంది.

తెలుగు రాష్ట్రాలలో నో బుకింగ్‌ స్లాట్స్

ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలోని ప్రజలు రిజిస్ట్రేషన్ చేసుకున్నాక, స్లాట్‌ బుకింగ్‌ కోసం ప్రయత్నించగా ఎక్కడ కూడా స్లాట్ లు అందుబాటులో లేవు. ఈ విషయంపై వారు కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టోల్ ఫ్రీ నెంబర్ కూడా సరిగా పనిచేయడం లేదని ఈ మాత్రం దానికి ఇంత ఆర్భాటం ఎందుకని ప్రశ్నించారు. “ముందు మురిసినమ్మ పండుగ ఎరుగదు” అనే సామెత లాగా ఉంది ప్రస్తుత పరిస్థితి. వ్యాక్సిన్‌ వేయించు కోవాలనుకొనే వారికి ప్రైవేటు, రాష్ట్ర ప్రభుత్వ కేంద్రాలు అందుబాటులో ఉంచే స్లాట్ల లభ్యత ఆధారంగా మాత్రమే బుకింగ్ అపాయింట్‌మెంట్‌లు లభిస్తాయి. అంటే వ్యాక్సిన్లు లభ్యంగా ఉండి… మే 1 నుంచి టీకాలు వేయడానికి సిద్ధంగా ఉన్న కేంద్రాలలో మాత్రమే ప్రజలకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వనున్నారు. అందరికీ వాక్సిన్ అందించడానికి సమయం పడుతుందని ఫార్మారంగ నిపుణులు అంటున్నారు.

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.