మాతృభాషలో చదివే విద్యార్దులకు కేంద్రం శుభవార్త తెలిపింది. ఎవరైతే మొదటి నుండి ఇంటర్ వరకు మాతృభాషలో విద్యాభ్యాసం చేస్తారో వారికి వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రాంతీయ భాషల్లో సాంకేతిక విద్యను, ముఖ్యంగా ఇంజనీరింగ్ కోర్సులను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం దేశ వ్యాప్తంగా ఉన్నా కొన్ని ఐఐటిలు మరియు ఎన్‌ఐటిలను ఎంపిక చేస్తునట్లు విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. గురువారం కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పాఠశాల విద్యా బోర్డులలో ప్రస్తుతం ఉన్న బేధాన్ని అంచనా వేసిన తరువాత నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టిఎ) పోటీ పరీక్షల కోసం సిలబస్‌ ను తయారు చేయనుందని సమావేశంలో నిర్ణయించారు.(చదవండి: అన్నదాతలకు తీపికబురు.. అకౌంట్లలోకి రూ.2,000!)

సమావేశం తరువాత, పోఖ్రియాల్ ట్విట్టర్లో ఇలా అన్నారు.. “మాతృభాషలో విద్యను అందించటానికి ఇంజనీరింగ్ కోర్సులు వచ్చే విద్యాసంవత్సరం నుండి ప్రారంభించబడతాయని దీనికోసం సమావేశంలో ఒక కీలక నిర్ణయం కూడా తీసుకోబడింది. మాతృభాషలో విద్యాభ్యాసం కోసం కొన్ని ఐఐటిలు మరియు ఎన్‌ఐటిలను ఎంపిక చేస్తున్నాం షార్ట్‌లిస్ట్ చేయబడుతున్నాయి” పేర్కొన్నారు.

2021 నుండి హిందీ మరియు ఇంగ్లీష్ కాకుండా తొమ్మిది ప్రాంతీయ భాషలలో జెఇఇ-మెయిన్ నిర్వహించాలని ఎన్‌టిఎ ఇప్పటికే నిర్ణయించింది. అయితే, జెఇఇ-అడ్వాన్స్‌డ్ ప్రాంతీయ భాషలో అందించడానికి ఎలా దానిపై ఐఐటిలు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ప్రభుత్వ సీనియర్ వర్గాల సమాచారం ప్రకారం, ప్రాంతీయ భాషలలో కూడా జెఇఇ-అడ్వాన్స్‌డ్‌ను అందించడానికి విద్యా మంత్రిత్వ శాఖ ఐఐటిలను సంప్రదిస్తుంది. ఏదైనా ప్రాంతీయ భాషలోవిద్యాభ్యాసం చేసే వారికి ఇది చాలా మంచి శుభపరిణామం.

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here