ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం లబ్ధిదారులకు శుభవార్త. ఈ పథకంలో భాగంగా 11.17 కోట్ల మంది రైతుల అకౌంట్లోకి 7వ విడత డబ్బుల్ని జమ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది మూడో విడత డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. డిసెంబర్ నెలలో రైతులకు మళ్లీ రూ.2,000 వచ్చి చేరనున్నాయి. పీఎం కిసాన్ స్కీమ్ కింద ఏడాదికి రూ.6,000 వస్తాయి. అయితే ఈ డబ్బులు ఒకేసారి కాకుండా మూడు విడతల్లో అన్నదాతల బ్యాంక్ ఖాతాల్లో జమాచేస్తారు. అంటే ఒక్కో ఇన్‌స్టాల్‌మెంట్‌కు రూ.2,000 వస్తాయి. ఈ ఏడాది ఇప్పటికే రెండు విడతల్లో 4,000 రూపాయలను రైతు ఖాతాల్లోకి జమ చేసింది. పీఎం కిసాన్ స్కీమ్ ప్రారంభం నుండి చూస్తే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లోకి రూ.12,000 జమచేసింది.(చదవండి: ఆన్ లైన్ క్లాసుల కోసం సరికొత్త ఫీచర్ ని తీసుకొచ్చిన గూగుల్ మీట్)

మీరు ఇప్పటికే పీఎం కిసాన్ స్కీమ్‌లో చేరి ఉంటే మీకు సులభంగానే డబ్బులు వస్తాయి. ఒకవేళ ఇంకా మీరు ఈ స్కీమ్‌లో చేరకపోతే వెంటనే చేరండి. ఆన్‌లైన్‌లో పీఎం కిసాన్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి సులభంగానే స్కీమ్‌లో రిజిస్టర్ చేసుకోవచ్చు. https://pmkisan.gov.in/ ఈ లింక్ సాయంతో మీరు వెబ్‌సైట్‌లోకి వెళ్లొచ్చు. ఆధార్ నెంబర్, పొలం పాస్‌బుక్, బ్యాంక్ అకౌంట్ వివరాలు మీ వద్దనే ఉంచుకోండి.

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. ప్రభుత్వ సేవల మరియు టెక్నాలజీ పరిజ్ఞానం యొక్క తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here