కేంద్ర ఆర్దిక మంత్రి నిర్మల సీతారామన్ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన బడ్జెట్‌ 2021లో ప్రధాన మంత్రి ఉజ్వల యోజన(పీఎంయువై) పథకం కింద మరో కోటి మంది లబ్ధిదారులకు ఉచిత ఎల్‌పీజీ కనెక్షన్ అందించనున్నట్లు ప్రకటించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం, బీపీఎల్ పరిధిలోకి వచ్చే కుటుంబాలు ఈ పథకం యొక్క ప్రయోజనాన్ని పొందవచ్చు. త్వరలో ఒక కోటి మంది మహిళలు ఉజ్వల పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ పథకం కింద మొత్తం 8 కోట్ల బీపీఎల్ కుటుంబాలకు ఉచిత ఎల్‌పీజీ కనెక్షన్లు అందించనున్నారు.(ఇది చదవండి: రేషన్ కార్డు కోసం ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింకు చేయండి ఇలా..?)

ఈ పథకం కింద పేద కుటుంబాలకు భారత ప్రభుత్వం రూ.1600 ఆర్థిక సహాయం అందిస్తుంది. ఈ మొత్తాన్ని కొత్త ఎల్‌పీజీ కనెక్షన్ తీసుకునేముందు అందించనుంది. అలాగే తొలిసారి స్టవ్ కొనుగోలు చేసేటప్పుడు, సిలిండర్లను మొదటిసారి నింపేటప్పుడు అయ్యే ఖర్చులను భరించటానికి ఈఎంఐ సౌకర్యాన్ని కేంద్రం కల్పించింది. పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ సహకారంతో ప్రధానంగా మహిళల కోసం ఈ పథకం నడుస్తున్నట్లు గమనించండి. ఈ పథకం కింద ఉచిత గ్యాస్ కనెక్షన్ కోసం అవసరమైన అన్ని సమాచారం ఇవ్వాలి.

ఎల్‌పీజీ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకోండి ఇలా:

  • ప్రధాన మంత్రి ఉజ్జ్వాల యోజన వెబ్‌సైట్ pmujjwalayojana.comను సందర్శించండి.
  • “డౌన్‌లోడ్ ఫారం” ఎంపికపై క్లిక్ చేసి ఫారాన్ని డౌన్లోడ్ చేసుకోండి లేదా మన చాట్ బాక్స్ లో మాకు కామెంట్ పెట్టండి.
  • ఫారంలో మీ పూర్తి వివరాలను నింపిన తర్వాత సమీప గ్యాస్ ఏజెన్సీకి సమర్పించండి.
  • ఫారంతో పాటు బీపీఎల్ కార్డ్, బీపీఎల్ రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఓటరు ఐడి, పాస్‌పోర్ట్ సైజు ఫోటో, రేషన్ కార్డ్ కాపీని జత చేసి వారికి ఇవ్వండి.
  • పత్ర ధృవీకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత మీరు కనెక్షన్ పొందే అవకాశం ఉంది.

ఉజ్వల పథకం కింద గ్యాస్ కనెక్షన్ పొందడానికి బీపీఎల్ కుటుంబానికి చెందిన ఒక మహిళ మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం KYC ఫారమ్‌ను నింపి సమీపంలోని LPG కేంద్రంలో ఇవ్వాలి. దరఖాస్తు చేసేటప్పుడు మీరు 14.2 కిలోల సిలిండర్ ఆప్షన్ ఎంచుకోవాలి.

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here