ములిగే నక్క మీద తాటి పండు పడ్డట్టు ఉంది ఎల్‌పీజీ గ్యాస్ వినియోగదారుల పరిస్థితి. ఇప్పటికే గత ఏడాది నుంచి ఇప్పటి వరకు ఎల్‌పీజీ గ్యాస్ ధర రూ.125 రూపాయలకు పైగా పెంచిన సంగతి మనకు తెలిసిందే. ఇప్పుడు సామాన్యులు గ్యాస్ సిలిండర్ బుక్ చేయాలంటే చుక్కలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కరోనా మహమ్మారి కారణంగా సామాన్య ప్రజలు అల్లాడుతుంటే వారికి షాక్ ఇచ్చేందుకు కేంద్రం సిద్దమవుతుంది. (ఇది చదవండి: రూ.40వేల కోట్లు దానం చేస్తానంటున్న బిలియనీర్?)
ప్రతిరోజూ పెట్రోల్, డీజిల్ ధరలు మారుస్తున్నట్లే ఇక నుంచి వారం లేదా 15రోజులకు ఒకసారి ధరలను మార్చాలని కేంద్రం యోచిస్తుంది. దీని ద్వారా గ్యాస్ పై ప్రభుత్వానికి కలుగుతున్న నష్టాన్ని పూడ్చుకోవాలని కేంద్రం చూస్తుంది. ప్రస్తుతం అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధరలకు అనుగుణంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. కానీ, వంట గ్యాస్ ధరలు మాత్రం క్రూడ్ ఆయిల్ ధరలకు అనుగుణంగా పెరగకపోవడం వల్ల నష్టపోతున్నట్లు కంపెనీలు ఆరోపిస్తున్నాయి. ప్రస్తుతం ఎల్‌పీజీ సిలిండర్ ధర ప్రతి నెలా మారుతూ వస్తున్న విషయం తెలిసిందే. కొన్నిసార్లు ధరలో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చు.(ఇది చదవండి: మహిళని కిడ్నాప్ భారీ నుంచి కాపాడిన యాపిల్ స్మార్ట్‌వాచ్!)
ఇది చాలదు అన్నట్లు కేంద్రం గ్యాస్ సిలిండర్ పై ఇస్తున్న సబ్సిడీని తగ్గిస్తూ వస్తుంది. దీనికి ప్రధాన కారణం గతంలో పెట్రోలియం సబ్సిడీ కింద రూ.40,915 కోట్లు కేటాయిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.12,995 కోట్లు మాత్రమే కేటాయించింది. గతంలో సిలిండర్ ధర రూ.1,000 ఉన్నప్పుడు కూడా రూ.500లను సబ్సిడీ రూపంలో అందిచేది. ప్రస్తుతం సిలిండర్ ధర మాత్రం హైదరాబాద్‌లో రూ.771.50 ఉన్న కూడా సబ్సిడీ కింద రూ.170 మాత్రమే చెల్లస్తుంది. మిగతా 600 రూపాయలను భరించాల్సి వస్తుంది. భవిష్యత్ లో కూడా గ్యాస్ ధరలు ఆకాశాన్ని తాకేలా కనిపిస్తున్నాయి.
మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.