దేశంలో వంట గ్యాస్ ధరలు మరోసారి భగ్గుమన్నాయి. ఎల్‌పీజీ గ్యాస్ పై ఫిబ్రవరి 4న రూ.25పైగా పెంచిన చమురు కంపెనీలు ఇప్పుడు తాజాగా మరోసారి లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్(ఎల్‌పీజీ) డొమెస్టిక్ గ్యాస్ సిలెండర్(14.2 కిగ్రా)పై రూ.50 చొప్పున పెంచాయి. పెంచిన ధరలు నేటి నుంచి అమలులోకి రానున్నాయి. ప్రస్తుతం ఢిల్లీలో సిలిండర్ ధర ₹.769గా ఉంది. ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను ప్రభుత్వ రంగ చమురు సంస్థలు నిర్ణయిస్తాయి.(ఇది చదవండి: ఎమ్ఆధార్(mAadhaar) వినియోగదారులకు తీపికబురు)
ప్రస్తుతం హైదరాబాద్ లో ఎల్‌పీజీ వంట గ్యాస్ ధర రూ.821గా ఉంటే, విజయవాడలో రూ.910గా ఉంది. ప్రాంతాలవారీగా ఈ ధరల్లో తేడాలుంటాయి. భారత ప్రభుత్వం ప్రస్తుతం దేశీయ ఎల్‌పీజీ సిలిండర్ల అమ్మకాలపై సబ్సిడీని వినియోగదారులకు అందిస్తోంది. సబ్సిడీ మొత్తం నేరుగా సిలిండర్ కొనుగోలు చేసిన తర్వాత ఆ వ్యక్తి బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. అంతర్జాతీయ ఇంధన రేట్లు, అమెరికా డాలర్-రూపాయి మారకం రేట్లపై ఆధారపడి గ్యాస్ ధరలు మారుతుంటాయి.
మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.