LOCKDOWN: మహారాష్ట్రలో కరోనా విలయతాండవం చేస్తుంది. కోవిడ్-19 కారణంగా మహారాష్ట్రలో నిన్న ఒక్కరోజే 568 మరణించారు. అలాగే, 67,468 కేసులు కూడా నమోదయ్యాయి. కరోనా ప్రారంభం నుంచి ఇంత స్థాయిలో కేసులు నమోదు అవ్వడం ఇదే మొదటిసారి. కరోనా కట్టడికీ ఇప్పటికే కఠిన చర్యలు తీసుకుంటున్నా ఫలితం లేదు. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం చివరకు లాక్డౌన్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఏప్రిల్ 22 రాత్రి నుంచి మే 1వ తేదీ వరకు లాక్డౌన్ విధిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కరోనా కట్టడికి ఇక విధిలేక లాక్డౌన్ వైపు ప్రభుత్వం మొగ్గు చూపింది. కరోనా కట్టడి కోసం అందరూ సహకరించాలని ప్రజలను ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. “కోవిడ్-19 వైరస్ వ్యాప్తితో రాష్ట్రానికి ముప్పు ఉందని రాష్ట్ర ప్రభుత్వం భావించడం జరిగింది. అందువల్ల వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి, నియంత్రించడానికి కొన్ని కఠిన చర్యలు తీసుకోవడం అత్యవసరం” అని మహారాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులో తెలిపింది.
గత వారమే లాక్డౌన్ విషయమై అన్ని పార్టీల నాయకులతో సమావేశమై చర్చించి రాత్రిపూట కర్ఫ్యూ, వారాంతపు లాక్డౌన్ విధించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇన్నీ చర్యలు తీసుకున్నా కూడా కరోనా వైరస్ అదుపులోకి రాకపోవడంతో చివరకు గత్యంతరం లేక లాక్డౌన్ విధిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గురువారం నుంచి మే 1వ తేదీ వరకు సంపూర్ణ లాక్డౌన్ అమల్లోకి రానుంది. ప్రస్తుతం మహారాష్ట్రలో రోజుకు అర లక్షకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.
మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్బుక్(Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.