దేశ వ్యాప్తంగా వాహనదారులకు షాకింగ్ న్యూస్ తెలిపింది. దేశ వ్యాప్తంగా పెరగుతున్న కాలుష్యం దృష్ట్యా కాలుష్యాన్ని అరికట్టే ప్రయత్నంలో భాగంగా కొత్త నిబందన తీసుకొచ్చింది కేంద్రం. అన్ని వాహనాలకు యూనిఫార్మ్ పొల్యూషన్ అండర్ కంట్రోల్(పీయూసీ) సర్టిఫికేట్ ను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ. వచ్చే ఏడాది నుండి మీ వాహనానికి పియుసి సర్టిఫికేట్ లేకపోతే అధికారులు మీ వాహనం యొక్క రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (ఆర్‌సి)ను జప్తు చేయవచ్చు. ఈ వారం, రహదారి రవాణా మంత్రిత్వ శాఖ పియుసి వ్యవస్థను అమలులోకి తీసుకొచ్చే ముందు వాటాదారుల నుండి సలహాలు కోరుతూ ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే, ఈ ప్రక్రియకు అమలుకు రెండు నెలలు సమయం పడనుందని తెలిపింది.(చదవండి: గ్యాస్ బుకింగ్ చాలా సులభం)
కొత్త నిబందన ప్రకారం, వాహన యజమానులందరూ నిర్ణీత వ్యవధిలో వాహనం యొక్క పీయూసీని పునరుద్ధరించడం తప్పనిసరి. ఒకవేళ వినియోగదారు చెల్లుబాటు అయ్యే పియుసి సర్టిఫికెట్‌ను కలిగి లేనట్లయితే.. వాహనదారులకు ఏడు రోజుల గ్రేస్ పీరియడ్ ఇవ్వబడుతుంది. ఈ వ్యవధిలో చెల్లుబాటు అయ్యే ధృవీకరణ పత్రాన్ని సమర్పించడంలో విఫలమైతే వాహనం యొక్క రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ స్వాధీనం చేసుకోవచ్చు. అంతేకాకుండా, వినియోగదారులు అదనపు పొగలను విడుదల చేస్తున్నట్లు కనిపిస్తే వారి వాహనాలను తనిఖీ చేయనున్నారు. అలాంటి వినియోగదారులకు వారి వాహనాలను మరమ్మతు చేయడానికి ఏడు రోజుల సమయం కూడా ఇవ్వబడుతుంది. వాణిజ్య వాహనాలపై కూడా ఇదే నిబంధనలు వర్తిస్తాయి. గత కొన్ని వారాలుగా ప్రమాదకర స్థాయికి చేరుకున్న దేశంలో వాయు కాలుష్యాన్ని నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త నిబంధనను తీసుకువచ్చింది.
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.