గత ఏడాది గాల్వాన్ లోయలో భారత, చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఘర్షణలో చైనా సైనికులు మేకులు గుచ్చిన ఇనుప రాడ్లతో మన సైనికుల మీద దాడి చేశారు. ఈ దాడి వల్ల మన దేశానికి చెందిన సైనికులు కూడా చనిపోయారు. అయితే, వారిపై పగ తీర్చుకునేందుకు మన సైనికుల్ని కాపాడుకునేందుకు త్రిశూల్, వజ్ర పేర్లతో శక్తివంతమైన ఆయుధాలను భారత సైన్యం సిద్ధం చేసుకుంటోంది. పరమశివుని చేతిలో త్రిశూలం ఇప్పుడు మన సైనికుల చేతుల్లో ఆయుధంగా మారింది.
చైనా సైన్యం(పీఎల్‌ఏ) వాడిన మాదిరిగానే సంప్రదాయ ఆయుధాలనే భారత సైన్యం కూడా సిద్దం చేసుకుంటుంది. ఈ మేరకు బాధ్యతలను నోయిడాకు చెందిన అపాస్టెరాన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు అప్పగించింది. ఈ సంస్థ త్రిశూల్, వజ్ర వంటి పేర్లతో ఎక్కువ ప్రాణహాని కలిగించని సంప్రదాయ ఆయుధాలకు రూపకల్పన చేసింది. త్రిశూల్ ఆయుధాన్ని శత్రు సైనికుడు కొద్ది సెకన్లలోనే అక్కడే షాక్‌తో పడిపోతాడు. శత్రువుల వాహనాలను అడ్డుకునేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది. అదేవిధంగా, వజ్ర ఆయుధం కూడా ఇనుపరాడ్‌లాగా కనిపించే ఈ ఆయుధం మెరుపులాంటి షాక్ కలిగిస్తుంది. శత్రు సైనికులపై ముఖాముఖి పోరులో దాడి చేసేందుకు, వారి బుల్లెట్ ప్రూఫ్ వాహనాల టైర్లకు పంక్చర్ చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది.(ఇది కూడా చదవండి: రైతులకు కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త!)