ఢిల్లీలో కొనసాగుతున్న రైతు ఆందోళన మధ్య ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ ఫండ్ 7వ విడత నిధులను విడుదల చేసింది. డిసెంబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా 11 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి జమ చేస్తుంది. ఈ పథకం కింద ప్రభుత్వం ఇస్తున్న నగదు వల్ల ప్రతి సంవత్సరం రైతులు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయడం సులభమవుతుంది. ఒకవేళ మీరు పీఎం కిసాన్ సమ్మాన్ ఫండ్ కు కూడా దరఖాస్తు చేస్తే, ఇంకా మీ అకౌంట్ లోకి డబ్బులు వచ్చాయో లేదో తెలుసుకోవడానికి మీరు ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఇంకా 6 విడత డబ్బులు చూపిస్తున్నాయి చూపిస్తుంది. ఇంకా డబ్బులు రాని వారికి డిసెంబర్ 10న ఈ డబ్బులు రావొచ్చు. మీరు ఈ క్రింద చూపిన వీడియోలో చెప్పినట్లు ఆన్లైన్ లో చెక్ చేసుకోండి.

(చదవండి: పాత పద్ధతిలోనే వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్)

ఒకవేళ ఇప్పుడు మీ పేరు పీఎం కిసాన్ పోర్టల్ లో అప్ లోడ్ చేసినా నగదు మొత్తం మీ ఖాతాలోకి రాలేదంటే ఇబ్బంది పడనవసరం లేదు.. ఎందుకంటే సరైన పత్రాలు లేక, మీరు సమర్పించిన పాత్రల్లో లోపాల వల్ల వాయిదా పడిపోతాయి. దీనికోసం మీరు పీఎం కిసాన్ పోర్టల్ కు వెళ్లి మీ లోపాలను సరిదిద్దుకోగలుగుతారు. కొన్ని రోజుల తర్వాత మీ ఇన్ స్టాల్ మెంట్ మీ ఖాతాలోజమ అవుతుంది. ఒకవేళ మీ పేరు కొత్త జాబితాలో లేనట్లయితే, పీఎం కిసాన్ సమ్మాన్ హెల్ప్ లైన్ నెంబరుకి కాల్ చేసి మీ ఫిర్యాదును రిజిస్టర్ చేసుకోవచ్చు. హెల్ప్ లైన్ నెంబరు 011-24300606కు మీరు కాల్ చేయవచ్చు. చివరి విడతలో ఒక కోటి మందికి పైగా ఈ పథకం యొక్క ప్రయోజనాన్ని పొందలేకపోయారు.

ఇంకా సమాచారం కోసం హెల్ప్ లైన్ కూడా తీసుకోవచ్చు:
పీఎం కిసాన్ హెల్ప్ లైన్ నంబర్:155261
పీఎం కిసాన్ టోల్ ఫ్రీ నంబర్: 18001155266
పీఎం కిసాన్ ల్యాండ్ లైన్ నంబర్: 011-23381092, 23382401
పీఎం రైతు హెల్ప్ లైన్: 0120-6025109
ఈ-మెయిల్ ఐడీ: pmkisan-ict@gov.in

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.