ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రైతులకు ఆర్ధిక సహాయం చేసేందుకు ప్రతి ఏడాది రూ.6,000 పిఎం కిసాన్ పథకం కింద జమ చేస్తుంది. అయితే, గత కొన్ని రోజుల నుంచి ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన(PM KSY) స్కీమ్‌లో ఉన్న రైతులకు అందిస్తున్న ఆర్థిక సాయాన్ని రెట్టింపు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందన్నది అని సమాచారం. ప్రస్తుతం పీఎం కిసాన్ పతాకంలో భాగంగా రైతులకు రూ.2,000 చొప్పున ఏడాదికి మూడు విడతల్లో రూ.6,000 ఆర్థిక సాయాన్ని అందిస్తోంది.

ప్రతీ నాలుగు నెలలకు ఒకసారి పీఎం కిసాన్ స్కీమ్ కింద నగదును నేరుగా రైతుల అకౌంట్లలో జమ చేస్తోంది. ఇటీవల బీహార్ వ్యవసాయ శాఖ మంత్రి అమరేంద్ర ప్రతాప్ సింగ్, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను ఢిల్లీలో కలిసినప్పుడు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ డబ్బులను రెట్టింపు చేయాలని కోరారు. దీనిపై ఇంకా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం ఒక విడతలో ఇస్తున్న రూ.2,000 బెనిఫిట్‌ను రెట్టింపు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు గతంలో కూడా వార్తలు వచ్చాయి. అంటే ఇకపై రూ.4,000 చొప్పున ఇవ్వనుంది. అంటే ఏడాదికి రూ.12,000 వరకు రైతులకు లభించనుంది. కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటే రైతులకు డబుల్ బెనిఫిట్ లభించనుంది.(చదవండి: మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. వరల్డ్ రికార్డు రేంజ్ 480 కి.మీ)