PM Kisan Samman Nidhi Yojana

కేంద్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సహాయం కింద పీఎం కిసాన్ పథకం రూపంలో ప్రతి ఏడాది రూ.6,000 చొప్పున రైతుల ఖాతాలో జమ చేస్తుంది. ఈ నగదును ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రూ. 2 వేల రూపాయల చొప్పున మూడు విడతాలలో జమ చేస్తుంది. అయితే, ఈ పీఎం కిసాన్ చేరిన రైతుల కోసం మరో పథకాన్ని తీసుకొచ్చింది కేంద్రం ప్రభుత్వం. ఈ పథకం కింద చేరిన రైతులకు వృద్దప్య పెన్షన్ కింద ప్రతి నెల 3వేల రూపాయలను రైతు ఖాతాలో జమ చేస్తుంది.(ఇది చదవండి: ఈ పోస్టాఫీసు స్కీమ్‌లో చేరితే ప్రతి నెల రూ.5వేలు మీ సొంతం!)

ఈ పథకాన్ని కేంద్రం గతంలోనే తీసుకొచ్చినప్పటికి చాలా మంది అవగాహన లోపం వల్ల ఈ పథకం ద్వారా వచ్చే ప్రయోజనాన్ని పొందలేక పోతున్నారు. ఈ పథకం పేరు ప్రధాన మంత్రి కిసాన్ మాన్ దాన్ యోజన. రైతుల జీవనానికి భ‌ద్ర‌తను క‌ల్పించడం కోసం ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఝార్ ఖండ్ రాజ‌ధాని రాంచీలో ప్ర‌ధాన మంత్రి కిసాన్ మాన్ ధ‌న్ యోజ‌నను ప్రారంభించారు. 5 కోట్ల మంది చిన్న రైతులు, ఉపాంత రైతుల సామాజిక భద్రత కోసం ఉద్దేశించిన ప్రభుత్వ పథకం. వారికి 60 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు పూర్తి కావడంతోనే కనీసం 3,000 రూపాయ‌ల వంతున ప్ర‌తి నెలా పింఛ‌నును క‌ల్పించడం జరుగుతుంది.

అర్హతలు:

18 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు గల 2 హెక్టార్ల వరకు సాగు చేయగల భూములను కలిగి ఉన్న చిన్న, ఉపాంత రైతులు ఈ పథకం కింద చేరడానికి అర్హులు. ఈ పథకం కింద, 60 ఏళ్లు నిండిన తరువాత రైతులకు నెలకు 3000 /- రూపాయల కనీస భరోసా పెన్షన్ లభిస్తుంది. 60 సంవత్సరాల తర్వాత రైతు మరణిస్తే, రైతు జీవిత భాగస్వామికి 50% పింఛను పొందటానికి అర్హత ఉంటుంది. అర్హత గల దరఖాస్తుదారులు 60 ఏళ్లు వచ్చే వరకు వయస్సును బట్టి నెలకు రూ.55 నుంచి 200 రూపాయల వరకు చెల్లించాల్సి ఉంటుంది. రైతు చెల్లించే మొత్తానికి సమానంగా కేంద్రం కూడా జమ చేస్తుంది. ఈ పథకాన్ని ఎల్ఐసీ నిర్వహిస్తుంది.(ఇది చదవండి: పీఎంయువై కింద ఉచిత ఎల్‌పీజీ కనెక్షన్, రూ.1600 పొందండి ఇలా?)

భాగస్వామికి 50 శాతం పెన్షన్:
దరఖాస్తుదారుడికి 60 ఏళ్లు నిండిన తర్వాత పెన్షన్ మొత్తాన్ని క్లెయిమ్ చేయవచ్చు. ప్రతి నెల ఒక స్థిర పెన్షన్ మొత్తం సంబంధిత వ్యక్తి యొక్క పెన్షన్ ఖాతాలో జమ అవుతుంది.ఒక వేల పెన్షన్ దారుడు మద్యలో చెల్లించకపోయిన, చనిపోయిన భాగస్వామికి, నామినీకి ఆ డబ్బుతో పాటు వడ్డీ కూడా చెల్లిస్తారు. కానీ కనీసం 5 సంవత్సరాలు చెల్లిస్తేనే వడ్డీ రూపంలో చెల్లిస్తారు. ఒకవేళ పెన్షన్ దారుడు 60 సంవత్సరాల తర్వాత మరణిస్తే తన భాగస్వామికి 50 శాతం పెన్షన్ అందిస్తారు. ఇద్దరు మరణిస్తే ఆ డబ్బును పెన్షన్ ఫండ్ కు జమ చేస్తారు.(ఇది చదవండి: మూడేళ్లలో అన్ని గ్రామాలకు ఇంటర్నెట్‌ సౌకర్యం: సీఎం జగన్)

ధరఖాస్తు విధానం:
ఏదైనా కారణాల వల్ల తమ వాటాను మధ్యలో చెల్లించనట్లయితే, ఆ తర్వాత తన సభ్యత్వాన్ని పునరుద్ధరించుకోవాలంటే అప్పటి వరకు బకాయిపడిన మొత్తాన్ని వారు నిర్ణయించిన వడ్డీతో కలిపి చెల్లించాలి. కేంద్ర ప్రభుత్వం రైతులకు మరో వెసులుబాటు కూడా కల్పించింది. రైతుకు బదులు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు వారి వాటాల్ని చెల్లించేందుకు కేంద్రం అనుమతించింది. అలాగే ధరఖాస్తు కోసం మీ దగ్గరలోని మీ సేవ కేంద్రాలు, వ్యవసాయ అధికారి కార్యలయాలు, రైతు భరోసా కేంద్రాలకు వెళ్లి ఆధార్, భూమీ పాస్ బుక్, మీ వివరాలతో పాటు రూ.30 రూపాయల రుసుము చెల్లిస్తే సరిపోతుంది. పీఎం కిసాన్ రైతులు ప్రత్యేకంగా ఎటువంటి దృవీకరణ పత్రాలు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు.

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.