పీఎం కిసాన్ పథకం కోసం కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి కేంద్రం శుభవార్త అందించింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన నిదుల కోసం తమ పేరును ఇంకా నమోదు చేసుకోని రైతులు, ఈ పథకం నుంచి రెట్టింపు ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. కొత్తగా పీఎం కిసాన్ కోసం దరఖాస్తు చేసుకున్న రైతుల అప్లికేషన్ ను ఈ నెల జూన్ 30 లోపు ప్రభుత్వ అధికారులు గనుక ఆమోదిస్తే లేదా పిఎం కిసాన్ లబ్ది దారుల జాబితాలో మీ పేరు ఉంటే గత నెల, రాబోయే నెలలకు చెందిన రెండు విడతల నగదును ఒకేసారి పొందవచ్చు అని జీ న్యూస్ పేర్కొంది.(ఇది కూడా చదవండి: ఇంట్లోనే 5 నిమిషాల్లో పాన్ – ఆధార్ లింకు చేసుకోండి?)
రైతులకు పెట్టుబడి సహాయం కింద కొత్తగా కేంద్రం తీసుకొచ్చిన పథకమే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం. ఈ పథకం కింద 2 హెక్టార్ల/ 5 ఎకరాల వరకు భూమిని కలిగి ఉన్న చిన్న, ఉపాంత రైతు కుటుంబాలకు ఏడాదికి మూడు సార్లు రూ.2 వేల చొప్పున రైతుల ఖాతాలో నగదు జమచేస్తుంది. ఈ పథకానికి అర్హత గల రైతు కుటుంబాలను దేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు గుర్తించి నగదును నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలలో జమ అయ్యేలా చూస్తాయి. పీఎం కిసాన్ కోసం దరఖాస్తు చేసుకోవాలంటే ఆధార్ కార్డు, ల్యాండ్‌హోల్డింగ్ పేపర్లు/ పట్టా పాస్ బుక్, బ్యాంక్ ఖాతా వివరాలు అవసరం. మీరు దరఖాస్తు చేసుకున్న అప్లికేషన్ స్టేటస్ ని తెలుసుకోవడానికి మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ద్వారా కొత్త హెల్ప్‌లైన్ నంబర్ 011-24300606కి కాల్ చేయవచ్చు.
Support Tech Patashala

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.