• ఉజ్వల 2.0ను ప్రారంభించిన మోదీ
  • ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్తగా కోటి గ్యాస్‌ కనెక్షన్లు

గత ప్రభుత్వాల వైఫల్యాల కారణంగా దురదృష్టం కొద్దీ ప్రజల అత్యవసరాలైన ఆస్పత్రులు, రోడ్డు, విద్యుత్‌ వంటి తదితర కనీస సదుపాయాల కోసం దశాబ్దాలపాటు వేచి చూడాల్సి వచ్చిందని ప్రధాని మోదీ ఆరోపించారు. ప్రధాన్‌మంత్రి ఉజ్వల్‌ యోజన(పీఎంయూవై) ‘ఉజ్వల 2.0 వంట గ్యాస్‌ పథకాన్ని మంగళవారం ప్రధాని మోదీ ఉత్తరప్రదేశ్‌లోని మహోబాలో ప్రారంభించారు. మహిళా లబ్దిదారులకు వర్చువల్‌ పద్ధతిలో ఉచితంగా ఎల్‌పీజీ గ్యాస్‌ కనెక్షన్‌ సదుపాయాన్ని అందించారు. ఈ సందర్భంగా మోదీ ప్రసంగించారు ఈ అర్థికసంవత్సరేంలో కొత్తగా కోటి గ్యాస్‌ కనెక్షన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడం తెల్సిందే.

“75వ స్వాతంత్రదినోత్సవాన్ని ఈ ఏడాది జరుపుకోనున్నాం ఏడున్నర దశాబ్దాల్లో జరిగిన అభివృద్ధిని చూస్తుంటే.. కొన్ని దశాబ్దాల క్రితమే ఇంతటి అభివృద్ధి జరిగి ఉంటే బాగుండేదని మనం అనుకుంటున్నాం. రోడ్డు, విద్యుత్‌, ఆస్పత్రులు, వంట గ్యాస్‌, పాఠశాలలు, తాగు నీరు, ఇండ్ల వంటి ప్రాథమిక అవసరాల కోసం ఎంతో మంది దేశ ప్రజలు దశాబ్దాల పాటు వేచిచూశారు. ముఖ్యంగా మహిళలు చాలా ఇబ్బందిపడ్డారు. కనీస సౌకర్యాల కొరత తీరకుండా ఏ కుటుంబం/సమాజమైనా ఎలా తన కలలను నెరవేర్చుకోగలదు?. 2014లో బీజేపీ సర్కార్‌ అధికారంలోకి వచ్చాకే ఇలాంటి సమస్యలకు. వెంటనే పరిష్కారం చూపాలని నిర్ణయించుకుంది. గత ఆరేళ్లలో సమస్యలకు పరిష్కారాలే పరమావధిగా పాలన సాగించాం” అని మోదీ వ్యాఖ్యానించారు.

‘ఉజ్వల పథకం తొలి దశలో 8 కోట్ల పేద కుటుంబాలకు ఉచితంగా వంటగ్యాస్‌ కనెక్షన్లు ఇచ్చారు. దేశవ్యాప్త ఎల్‌పీజీ గ్యాస్‌ కవరేజీ దాదాపు 100 శాతానికి దగ్గరవుతోంది. ఉజ్వల 2.0లో ఎలాంటి డిపాజిట్‌ తీసుకోకుండా, కనీసం అడ్రస్‌. ప్రూఫ్‌ లేకుండా కొత్త కనెక్షన్‌ ఇస్తున్నాం. మొదటి రీఫిల్‌ సిలిండర్‌, హాట్‌ప్లేట్‌ ఉచితంగా అందిస్తున్నాం’ మోదీ చెప్పారు.

Support Tech Patashala

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here