న్యూఢిల్లీలో కొత్త పార్లమెంట్ భవనానికి డిసెంబర్ 10న ప్రధాని నరేంద్ర మోడీ పునాది వేస్తారని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా నేడు తెలిపారు. కొత్త పార్లమెంటు భవనం నిర్మాణం డిసెంబర్ లో ప్రారంభం అవుతుంది. 60,000 చదరపు విస్తీర్ణంలో రూ.971 కోట్ల ఖర్చుతో కొత్త పార్లమెంట్ భవనం అక్టోబర్ 2022 నాటికి పూర్తవుతుందని తెలిపారు. ప్రస్తుతం రిసెప్షన్, సరిహద్దు గోడలు మరియు ఇతర తాత్కాలిక నిర్మాణాలను కలిగి ఉన్న పార్లమెంట్ హౌస్ ఎస్టేట్ యొక్క ప్లాట్ నంబర్ 118లో రాబోతోంది. పార్లమెంటు సభ్యులందరికీ ప్రత్యేక కార్యాలయాలను నిర్మించనున్నట్లు మరియు ‘పేపర్‌లెస్ కార్యాలయాలు’ సృష్టించే దిశగా సరికొత్త డిజిటల్ ఇంటర్‌ఫేస్‌లను తయారు చేస్తున్నాం అని అన్నారు.(చదవండి: భారత్ బంద్ కు పిలిపునిచ్చిన రైతులు)
భవిష్యత్తులో రెండు సభల సభ్యుల సంఖ్య పెరగడాన్ని దృష్టిలో ఉంచుకుని కొత్తగా నిర్మించబోయే లోక్‌సభ ఛాంబర్‌లో 888 మంది సభ్యులు, రాజ్యసభలో 384 మంది సభ్యులు కూర్చునే విధంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుత భవనం బ్రిటిష్ కాలంలో నిర్మించిది. ప్రస్తుత పార్లమెంట్ భవనాన్ని ఎడ్విన్ లుటియెన్స్ మరియు హెర్బర్ట్ బేకర్ రూపొందించారు. కొత్త భవనంలో భారతదేశ ప్రజాస్వామ్య వారసత్వం, గొప్ప రాజ్యాంగ హాల్, పార్లమెంటు సభ్యులకు ఒక లాంజ్, ఒక లైబ్రరీ, బహుళ కమిటీ గదులు, భోజన ప్రదేశాలు, పార్కింగ్ కి తగినంత స్థలం ఉంటుంది. టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ కంపెనీకి ఈ భవన నిర్మాణ కాంట్రాక్టును అప్పగించారు. హెచ్ సీపీ డిజైన్, ప్లానింగ్ అండ్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నూతన పార్లమెంట్ డిజైన్‌ను రూపొందించిందని ఓం బిర్లా తెలిపారు.
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.