పీఎం వాణి (ప్రధానమంత్రి వైఫై యాక్సెస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్) పథకం ద్వారా దేశ వ్యాప్తంగా గ్రామీణ ప్రజలకి తక్కువ ధరకే ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి రానున్నాయని బ్రాడ్ బ్యాండ్ ఇండియా ఫోరం అధ్యక్షుడు టివి రామచంద్రన్ తెలిపారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ సంఖ్యలో ఇంటర్నెట్ కనెక్టివిటీ అందించడంతో పాటు, 2 కోట్లకు పైగా ఉద్యోగ అవకాశాలను సృష్టించే సామర్థ్యం పబ్లిక్ వై-ఫై మోడల్ పీఎం వాణికీ ఉందని తెలిపారు. పబ్లిక్ వై-ఫై మోడల్ సాధ్యత విషయంలో ఉన్న ఆందోళనలను తగ్గించనట్లు తెలిపారు.
ఇంకా చదవండి: వాట్సప్ లో మరో సరికొత్త ఫీచర్
ఈ కొత్త స్కీమ్ ద్వారా జనాలు ఎక్కువ ఉన్న ప్రదేశాలలో వైఫై కేంద్రాలు తీసుకురానునట్లు తెలిపారు. సమీప భవిష్యత్తులో మొబైల్ డేటా సుంకాలు 30-40 శాతం పెరిగే అవకాశం ఉందని అన్నారు. అలాగే ఇప్పుడున్న వై-ఫై సేవలు కూడా సామాన్యులకు మరింత ఖర్చుతో కూడుకున్న విషయం అన్నారు. పీఎం వాణి (ప్రధానమంత్రి వైఫై యాక్సెస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్) మాస్ పబ్లిక్ కనెక్టివిటీకి సరసమైన మార్గంగా ఉద్భవించగలదు అన్నారు. బ్రాడ్‌బ్యాండ్ అందించడానికి లైసెన్స్ ఫీజు ఉండదని ప్రభుత్వం తెలిపింది. ఈ విధానం పబ్లిక్ డేటా ఆఫీస్ (పీడీఓ), పబ్లిక్ డేటా ఆఫీస్ అగ్రిగేటర్లు(పీడీఓఏ), యాప్ డెవలపర్లు ఇలా వివిధ వర్గాల భాగస్వామ్యంతో రూపుదిద్దుకోనుంది. ఈ చర్యతో స్నేహపూర్వకంగా పూర్వక వ్యాపార వాతావరణం ఉంటుందని, వ్యాపారం సులభతరం చేసే ప్రయత్నాలకు అనుగుణంగా ఉంటుందని పేర్కొన్నారు.
4జీ మొబైల్ కవరేజ్ లేని ప్రాంతాలతో సహా దేశంలో అధిక సంఖ్యలో చందాదారులకు స్థిరమైన మరియు హై-స్పీడ్ ఇంటర్నెట్ సేవలను అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీని కోసం, పబ్లిక్ డేటా ఆఫీస్(పీడీఓ)ల ద్వారా పబ్లిక్ వైఫై నెట్‌వర్క్‌లను అందించే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. 2022 నాటికి 1 కోటి పబ్లిక్ వై-ఫై హాట్‌స్పాట్‌లను సృష్టించనున్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కేవలం 3.5 లక్షలు మాత్రమే ఉన్నాయి.
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.
[…] ఇంకా చదవండి: పీఎం వాణి పబ్లిక్ వైఫైతో 2 కోట్ల మంది… […]
[…] ఇంకా చదవండి: పీఎం వాణి పబ్లిక్ వైఫైతో 2 కోట్ల మంది… […]
[…] ఇంకా చదవండి: పీఎం వాణి పబ్లిక్ వైఫైతో 2 కోట్ల మంది… […]