PMUY: వంటగ్యాస్ సిలిండర్ల ధరలు భారీగా పెరుగుతున్న దృష్ట్యా మరోమారు ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద ఉచిత సిలిండర్లు ఇచ్చేందుకు కేంద్రం యోచిస్తోంది. కొత్త ఆర్థిక సంవత్సరం (2021-22)లో మూడు ఉచిత సిలిండర్లు ఇవ్వాలని భావిస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రతిపాదనల ఫైలు కేంద్ర పెట్రోలియం శాఖ నుంచి ఆర్థిక శాఖకు చేరినట్లు తెలుస్తోంది. కోవిడ్ పరిస్థితుల నుంచి సామాన్య ప్రజలు ఇంకా కోలుకోని దృష్ట్యా ఉచిత సిలిండర్‌ల అంశంపై చర్చలు జరుగుతున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం గృహావసరాలక్షై వినియోగించే 142 కిలోల సిలిండర్ ధర రూ.81.50 చేరింది.
ఒక్క ఫిబ్రవరి నెలలో సిలిండర్‌పై రూ.100 మేర పెంచిన అయిల్ కంపెనీలు మార్చి నెల ఆరంభంలోనే రూ.25 పెంచిన విషయం తెలిసిందే. నిజానికి నవంబర్‌లో సిలిండర్ ధర కేవలం రూ.646.50 మాత్రమే ఉండగా, నాలుగు నెలల్లో ఏకంగా రూ.225 మేర పెరిగింది. దీనికి తోడు గతంలో ఒక్కో సిలిండర్‌పై రూ.220 వరకు సబ్సిడీ జమ చేసిన కేంద్రం ప్రస్తుతం కేవలం రూ.40 మాత్రమే జమ చేస్తోంది. దీంతో నిరుపేదలపై తీవ్ర భారం పడుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఉజ్వల పథకంలోని 8కోట్ల మంది నిరుపేదలకు మరో మూడు నెలల పాటు ఉచిత గ్యాస్ సిలిండర్‌లు ఇవ్వాలని కేంద్రం యోచిస్తోంది.
రాష్ట్రంలో 10.12 లక్షల మంది లబ్దిదారులు
గత ఏడాది కోవిడ్ సమయంలో ఉజ్వల లబ్దిదారులకు మూడు నెలల పాటు ఉచిత సిలిండర్‌ను ప్రభుత్వం అందించింది. ముందస్తుగా బ్యాంక్ ఖాతాలో సిలిండర్‌కు అయ్యే నగదును జమ చేసింది. జమ అయిన నగదును వినియోగించుకొని వంట గ్యాస్ సిలిండర్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. వరుసగా మూడు నెలల పాటు మార్కెట్ రీఫిల్ ధరను బట్టి నగదు బదిలీ చేసింది. మొదటి నెల బ్యాంక్ ఖాతాలో పడిన నగదును వినియోగించుకుని సిలిండర్ కొనుగోలు చేస్తేనే మరుసటి నెల రీఫిల్ నగదు బ్యాంక్ ఖాతాలో జమ అయ్యేలా జాగ్రత్తలు తీసుకుంది. రాష్ట్రంలో ఈ పథకంతో సుమారు 10.12 లక్షల మందికి లబ్ధి జరిగింది. ప్రస్తుతం ఇదేరీతిన ఉచిత సిలిండర్‌లు ఇచ్చే అంశయమై కేంద్రం కసరత్తు చేస్తోంది.
మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.