Ration Services Now Available At Common Services Centers

రేషన్ కార్డుదారులకు కేంద్రం శుభవార్త తెలిపింది. కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు ఊరట కలిగించే కీలక నిర్ణయం తీసుకుంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్‌తో కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్‌సీ) భాగస్వామ్యం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం వల్ల దేశంలోని 23.64 కోట్లకు పైగా రేషన్ కార్డుదారులకు దేశవ్యాప్తంగా ఉన్న 3.70 లక్షల కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా రేషన్ సేవలు అందించనున్నారు.

ఇప్పుడు, మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్‌సీ) ద్వారా రేషన్ కార్డుకు సంబంధించిన అనేక సేవలను మీరు యాక్సెస్ చేసుకోవచ్చునని డిజిటల్ ఇండియా ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. రేషన్ దారులు ఈ భాగస్వామ్యం ఒప్పందం వల్ల కామన్ సర్వీస్ కేంద్రాలలో రేషన్ కార్డు సంబధించిన 6 రకాల సేవలను సద్వినియోగం చేసుకోవచ్చు.

సీఎస్‌సీ కేంద్రాలలో 6 రకాల రేషన్ సేవలు..

  1. రేషన్ కార్డు వివరాలను అప్‌డేట్‌ చేసుకోవచ్చు.
  2. మీ రేషన్‌ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేయవచ్చు.
  3. మీ రేషన్ కార్డు నకిలీ ప్రింట్ పొందవచ్చు.
  4. మీ రేషన్ లభ్యత వివరాల గురించి సమాచారం తెలుసుకోవచ్చు.
  5. రేషన్ కార్డుకు సంబంధించిన అన్ని ఫిర్యాదులు చేయవచ్చు.
  6. రేషన్ కార్డు పోతే కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here