ప్రస్తుతం కరోనా తిరిగి పుంజుకుంటున్న నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా కొన్ని దేశాలు మళ్ళీ లాక్ డౌన్ దిశగా ప్రయత్నిస్తున్నాయి. అయితే, ఈ నేపథ్యంలో మన దేశంలో కూడా కరోనా వైరస్ కేసులు గణనీయంగా పెరుగుతున్నందున, డిసెంబరులో దేశంలో ప్రభుత్వం మరో సారి లాక్ డౌన్ విధించవచ్చని అనేక పుకార్లు సోషల్ మీడియాలో వస్తున్నాయి.
ప్రజారోగ్య వ్యవస్థను ముంచెత్తుతున్న కరోనా వ్యాప్తిని నియంత్రించడానికి ఫ్రాన్స్ తరువాత బ్రిటన్ లాక్డౌన్ -2 ను ప్రకటించినట్లు మనం తెలుసుకోవాలి. నిజానికి, రెండవ వేవ్ భారతదేశంలో కూడా ప్రారంభమైంది. భారతదేశంలో రెండవ సారి కరోనా వైరస్ విజృంభణ ప్రారంభమైనట్లు ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా ఇటీవల హెచ్చరించారు. ఖచ్చితంగా అవసరమైతే తప్ప ప్రజలు ఇంటిని విడిచిపెట్టరాదని ఆయన అన్నారు. దేశవ్యాప్తంగా కరోనా రోగుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న తరుణంలో గులేరియా ఒక ప్రకటన విడుదల చేశారు. మన నిర్లక్ష్యం మరియు వాయు కాలుష్యం కారణంగా కరోనా సంక్రమణ నిరంతరం పెరుగుతోందని ఎయిమ్స్ డైరెక్టర్ తెలిపారు. ఈ పరిస్థితిలో జాగ్రత్త తీసుకోవాలి లేకపోతే పరిస్థితి మరి అధ్వాన్నంగా మారుతుంది అని తెలిపారు.
సోషల్ మీడియాలో డిసెంబర్ 1 నుండి దేశంలో లాక్ డౌన్ పై వస్తున్న పుకార్లపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వివరణ ఇచ్చింది. ఈ ట్వీట్ మార్ఫింగ్ చేసినట్టు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ) వెల్లడించింది. లాక్‌డౌన్ విధింపు గురించి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపింది. ఇలాంటి ప్రచారాన్ని నమ్మవద్దని.. దీన్ని ఎవరూ ప్రచారం చేయొద్దని సూచించింది. మరోవైపు దేశంలో ప్రస్తుతం అన్‌లాక్ 5 మార్గదర్శకాలు కొనసాగుతున్నాయి. సెప్టెంబర్ చివరిలో వీటిని విడుదల చేసిన కేంద్రం.. నవంబర్ 30 వరకు ఈ అన్‌లాక్ 5 మార్గదర్శకాలు అమలులో ఉంటాయని స్పష్టం చేసింది.
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. ప్రభుత్వ సేవల మరియు టెక్నాలజీ పరిజ్ఞానం యొక్క తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.