రైల్వే ప్రయాణికులు సౌలభ్యం కోసం ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీని తీసుకొస్తుంది ఐఆర్‌సీటీసీ. కరోనా మహమ్మారి కారణంగా రైలు ప్రయాణం కోసం ఆన్లైన్ సేవలు వినియోగించుకునే వారి సంఖ్య ఎక్కువ కావడంతో.. మరిన్ని సేవలను ఆన్ లైన్ లో తీసుకొచ్చింది. తాజాగా వాట్సాప్ ద్వారా రియల్ టైమ్ పిఎన్‌ఆర్ స్టేటస్ మరియు ట్రైన్ జర్నీ సమాచారాన్ని పొందటానికి వినియోగదారులు పొందే అవకాశాన్ని కల్పిస్తుంది. “రైలు యొక్క పీఎన్‌ఆర్ స్టేటస్, రైలు లైవ్ స్టేటస్, ఆలస్యానికి సంబంధించిన వివరాలు, రాబోయే స్టాప్‌లకు సంబంధించిన వంటి సమాచారాన్ని తెలుసుకోవడానికి ఇతర వెబ్‌సైట్లలో వెతకడం ద్వారా మీ సమయాన్ని వృదా చేసుకోకుండా ఉండటానికి రైలోఫీ అనే కొత్త సౌకర్యాన్ని కల్పించనట్లు” సంస్థ తెలిపింది. (చదవండి: సరికొత్తగా నూతన పార్లమెంట్ భవనం డిజైన్)

వాట్సాప్ ద్వారా పిఎన్ఆర్ స్టేటస్ అలాగే రియల్ టైమ్ రైలు ప్రయాణం తెలుసుకోవడం కోసం క్రింది స్టెప్స్ ఫాలో అవ్వండి:

  1. మీ ఫోన్‌లో ఉన్న వాట్సాప్ యాప్‌ను అప్‌డేట్ చేయండి.
  2. ఇప్పుడు మీ మొబైల్ ఫోన్‌లో రైలోఫీ మొబైల్ నెంబర్ “+91-9881193322”ను సేవ్ చేయండి.
  3. ఇప్పుడు రైలోఫీకి మెసేజ్ చేయడం కోసం మీ వాట్సప్ లో కాంటాక్ట్ ఓపెన్ చేయండి.
  4. మీరు రైలోఫీకి చెందిన కాంటాక్ట్ ని ఎంచుకొని మీ 10 అంకెల పిఎన్‌ఆర్ నంబర్‌ను టైప్ చేసిపంపండి.
  5. మీరు పిఎన్‌ఆర్ నంబర్‌ను రైలోఫీకి పంపిన తర్వాత, మీకు ట్రైన్ యొక్క రియల్ టైమ్ లైవ్ స్టేటస్ అప్డేట్ లభిస్తుంది.

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here