2020లో ప్రపంచంలోని 6వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతున్న భారత్ 2025 నాటికి ఇంగ్లాండ్ ని అధిగమించి 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందని అ దేశ కన్సల్టెన్సీ సంస్థ సీఈబీఆర్‌‌‌‌ పేర్కొంది. అలాగే, 2030 నాటికి 3వ స్థానంలో కొనసాగుతున్న జపాన్ ను వెనక్కి నెట్టి భారత్ ఆ స్థానంలో నిలుస్తుందని పేర్కొంది. భారత్ 2019లోనే యూకేను అధిగమించి 5వ స్థానంలో నిలిచింది. కానీ, 2020లో వచ్చిన కరోనా మహమ్మారితో వృద్ది రేటు పడి పోవడంతో మళ్లీ 6వ స్థానంలో నిలిచింది.

ఇంకా చదవండి: 2020లో దేశంలో నిషేదింపబడిన టాప్ 5 పాపులర్ యాప్స్ ఇవే!

“కరోనా మహమ్మారి ప్రభావం వల్ల భారతదేశం కొంతవరకు వెనుకబడింది. ఫలితంగా, యూకేను అధిగమించిన 2019 తరువాత యుకే ఈ ఏడాది మళ్లీ భారతదేశాన్ని అధిగమించింది. అయితే, భారతదేశం మళ్లీ పుంజుకొని 2024 వరకు 5వ స్థానంలో కోనసాగుతుంది” అని సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ బిజినెస్ రీసెర్చ్ (సీఈబీఆర్) శనివారం ప్రచురించిన వార్షిక నివేదికలో తెలిపింది. రూపాయి క్షీణత కారణంగా 2020లో యూకే భారతదేశాన్ని మళ్లీ అధిగమించినట్లు తెలుస్తోంది. 2021లో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ది రేటు 9 శాతం, 2022లో 7 శాతం పెరుగుతుందని సీఈబీఆర్ అంచనా వేసింది.

2030లో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్

భారతదేశం మరింత వేగంగా ఆర్థికంగా వృద్ది చెందడంతో 2027 నాటికి జర్మనీని, 2030 నాటికి జపాన్లను అధిగమించి భారతదేశం ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుంది అని నివేదికలో పేర్కొంది. ఈ వృద్ది రేటు 2035లో 5.8 శాతానికి చేరుకుంటుందని అంచనా. 2028లో చైనా అమెరికాను అధిగమించి ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని యూకే ఆధారిత థింక్ ట్యాంక్ అంచనా. గతంలో అంచనవేసిన దానికంటే 5 సంవత్సరాలు ముందుగానే మొదటి స్థానంలో నిలవడానికి ప్రధాన కారణం చైనా కరోనా మహమ్మారి ప్రభావం నుండి అమెరికా కంటే వేగంగా కొలుకోవడమే అని నివేదిక తెలిపింది.

2030 వరకు డాలర్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతున్న జపాన్ ను భారత్ అధిగమిస్తుందని తెలిపింది. అలాగే జర్మనీని 2027 నాటికి అధిగమించి 4వ స్థానం నుండి 5వ స్థానానికి చేరుకుంటుంది. కోవిడ్ 19 సంక్షోభం కంటే ముందే భారత ఆర్థిక వ్యవస్థ మందగించింది అని సీఈబీఆర్ తెలిపింది. 2019లో భారత జిడిపి వృద్ధి రేటు పదేళ్ల కనిష్టానికి 4.2 శాతానికి పడిపోయింది. ఇది 2016లో నమోదైన 8.3 శాతం వృద్ధి రేటులో సగం. బ్యాంకింగ్ వ్యవస్థలో లోపం, కొత్త సంస్కరణలు తీసుకురావడం, ప్రపంచ వాణిజ్యం క్షీణించడం వంటి అంశాల కారణంగా భారత ఆర్దిక వ్యవస్థ వెనుకబడింది అని ఇది తెలిపింది.

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్(YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.