భారత దేశంలో అతిపెద్ద బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గమనిక. మీరు మీ ఎస్‌బీఐ ఖాతాకు ఆధార్ నెంబర్ లింక్ చేసుకున్నారా లేదా? ఒకవేల చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. లేకపోతే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఎస్‌బీఐ హెచ్చరించింది. మీ ఖాతాకు ఆధార్ నెంబర్ లింక్ చేసుకోకపోతే ప్రభుత్వ సబ్సిడీలు పొందలేరని పేర్కొంది. మీ ఖాతాలోకి ప్రభుత్వ సబ్సిడీలు తమ అకౌంట్లలోకి నేరుగా రావాలంటే వెంటనే ఆధార్ నెంబర్ ను వెంటనే ఎస్‌బీఐ ఖాతాకు లింకు చేసుకోవాలని ట్విట్టర్ ద్వారా తెలిపింది. ఆధార్ నెంబర్ ను ఎస్‌బీఐ ఖాతాకు లింకు చేయడానికి నాలుగు మార్గాలు ఉన్నాయి. ఎస్‌బీఐ మొబైల్ యాప్, ఎస్‌బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఎస్‌బీఐ ఎటిఎమ్, మీ దగ్గరల్లోని ఎస్‌బీఐ బ్యాంకు బ్రాంచీని సందర్శించడం ద్వారా ఆధార్ అప్డేట్ చేయవచ్చు.(ఇది చదవండి: వ్యవసాయ భూములపై సీఎం కేసీఆర్ ఆసక్తికర ప్రకటన)

అలాగే మీ మొబైల్ కు ప్రతి రోజు బ్యాంక్‌కు సంబంధించి కుప్పలు తెప్పులుగా ఎస్ఎంఎస్‌లు వస్తుంటాయి. వ్యక్తిగత రుణాల కోసం ఈ యాప్ ను వెంటనే డౌన్‌లోడ్ చేసుకోండి అని కొన్ని లింకులు మనకు వస్తుంటాయి. అయితే వీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఎస్‌బీఐ సూచించింది. ఇలాంటి లింకులను ఎప్పుడు క్లిక్ చేయవద్దు అని యూజర్లను కోరింది. దీని ద్వారా మీ ఖాతా ఖాళీ అయ్యే అవకాశం ఉంది అని సూచించింది. లోన్ కావాలంటే దగ్గరలోని ఎస్‌బీఐని సంప్రదించాలి అని పేర్కొంది. లోన్స్‌కి సంబంధించి పూర్తి సమాచారం ఎస్‌బీఐ వెబ్‌సైట్ లేదా యోనో యాప్స్‌లోనూ అందుబాటులో ఉంటుంది. ఇతర సమాచారం కోసం ఎస్‌బీఐ కస్టమర్ కేర్‌కు కాల్ చేసి తెలుసుకోవాలి అని ఎస్‌బీఐ తెలిపింది.

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.