Friday, December 6, 2024
HomeGovernmentJagananna Amma Vodi Scheme 2023: జగనన్న అమ్మఒడి పథకం.. పూర్తి వివరాలు!

Jagananna Amma Vodi Scheme 2023: జగనన్న అమ్మఒడి పథకం.. పూర్తి వివరాలు!

Jagananna Amma Vodi Scheme 2023 Details in Telugu: ఏపీ ప్రభుత్వం జగనన్న అమ్మఒడి పథకం ప్రారంభించడానికి గల ముఖ్య ఉద్దేశ్యం పేద కుటుంబాల పిల్లల చదువును ఎటువంటి ఆటంకం లేకుండా కొనసాగించడానికి ఆర్థిక సహాయం అందించడమే.

2019-2020 విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని రెసిడెన్షియల్ పాఠశాలలు/కళాశాలలతో సహా అన్ని గుర్తింపు పొందిన ప్రభుత్వ, ప్రైవేట్ ఎయిడెడ్ మరియు ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ పాఠశాలలు/ జూనియర్ కళాశాలల్లో 1 నుంచి XII వరకు(ఇంటర్మీడియట్ విద్య) పిల్లలు ఈ పథకం ప్రయోజనాలు పొందడానికి అర్హులు.

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాల్లో జగనన్న అమ్మ ఒడి పథకం(Jagananna Amma Vodi Scheme) కూడా ఒకటి. నవరత్నల్లో భాగమే ఈ పథకం. ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల తల్లుల బ్యాంక్ అకౌంట్లలో నేరుగా డబ్బులు జమ అవుతుంది. పేద కుటుంబంలోని పిల్లలు ఉన్నత చదువులు చదువుకోవాలనే మంచి లక్ష్యంతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ పథకాన్ని అందుబాటులోకి తెచ్చారు.

జగనన్న అమ్మ ఒడి ప్రయోజనాలు:

అమ్మఒడి పథకం(Jagananna Amma Vodi Scheme) కింద లబ్ధిదారులకు ప్రతి సంవత్సరం రూ.15 వేలు లభిస్తాయి. నేరుగా బ్యాంక్ ఖాతాలలో ఈ డబ్బులు జమ అవుతాయి. జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుకుంటున్న విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఈ డబ్బులు జమ చేస్తోంది. ప్రతి ఏడాది ఈ డబ్బులు జమ అవుతూనే ఉంటాయి.

- Advertisement -

జగనన్న అమ్మఒడి పథకం వివరాలు:

పథకం పేరుజగనన్న అమ్మఒడి
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
లక్ష్యంపేదింటి పిల్లల చదువు కోసం ఆర్థిక చేయూత
లబ్ధిదారులు1వ తరగతి నుంచి ఇంటర్ వరకు విద్యార్థులు
అధికారిక వెబ్‌సైట్https://jaganannaammavodi-ap-gov-in/AMMAVODI/

జగనన్న అమ్మఒడి పథకం డబ్బులు పొందాలంటే కావాల్సిన అర్హతలు:

ఏపీ ప్రభుత్వం సాధారణంగా 2022 జనవరిలోనే ఈ స్కీమ్‌ను అమలు చేయాల్సి ఉంది. అయితే ప్రభుత్వం అమ్మఒడి పథకాన్ని జూన్ నెల నుంచి అమలు చేసింది. విద్యార్థుల హాజరు 75 శాతం ఉంటేనే పథకం వర్తిస్తుందని.. డబ్బులు లభిస్తాయి. అంటే విద్యార్థులు రెగ్యులర్‌గా స్కూల్ లేదా కాలేజ్‌కు వెళ్లాల్సిందే. తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి, ప్రభుత్వ లేదా ప్రైవేటు పాఠశాలల్లో చదివే పిల్లలకు ఈ పథకం(Jagananna Amma Vodi Scheme) వర్తిస్తుంది.

(ఇది కూడా చదవండి: SBI Whatsapp Banking Services: వాట్సాప్‌లో ఎస్‌బీఐ బ్యాంక్ బ్యాలెన్స్, మినీ స్టేట్‌మెంట్ చెక్ చేసుకోండి ఇలా..?)

జగనన్న అమ్మ ఒడి పథకానికి కావాల్సిన పత్రాలు ఇవే:

  • ప్రభుత్వం జారీ చేసిన తెల్ల రేషన్‌ కార్డు ఉండాలి.
  • లబ్ధిదారుడు తల్లికి ఆధార్‌ కార్డు ఉండాలి.
  • బ్యాంక్ అకౌంట్ తప్పనిసరి.
  • స్కూల్ ఐడీ కార్డు
  • ఈ పథకం ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు వర్తిస్తుంది.
  • విద్యార్థులు కనీసం 75 శాతం హాజరును కలిగి ఉండాలి.
  • ప్రభుత్వ ఉద్యోగస్థులు ఈ పథకానికి అర్హులు కాదు.

జగనన్న అమ్మ ఒడి పథకం స్టేటస్ చెక్ చేయడం ఎలా?

జగనన్న అమ్మ ఒడి పథకం కింద అర్హత కలిగిన విద్యార్థుల వివరాలను ఆన్‌లైన్‌లోనే చెక్ చేసుకోవచ్చు. ఎవరెవరికి డబ్బులు వస్తాయో ముందే చెక్ చేసుకోవచ్చు. దీని కోసం మీరు జగనన్న అమ్మఒడి వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. అక్కడ సెర్చ్ చైల్డ్ డీటైల్స్ ఫర్ అమ్మఒడి 2020-21 అని ఉంటుంది. దానిపై క్లిక్ చేయాలి. తర్వాత కొత్త విండో ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీ జిల్లా ఏదో ఎంచుకోవాలి. ఇలా మీరు వివరాలు తెలుసుకోవచ్చు.

(ఇది కూడా చదవండి: వాట్సాప్ స్టేటస్ వీడియో, ఫొటోలూ డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా?)

జగనన్న అమ్మఒడి పథకం కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

  • https://jaganannaammavodi-ap-gov-in/AMMAVODI/ వెబ్ సైట్లో దరఖాస్తు ఫారం డౌన్‌లోడ్ చేసుకోవాలి లేదా మీ సమీపంలోని వార్డు సచివాలయం లేదా గ్రామ సచివాలయంలో దరఖాస్తు ఫారం పొందవచ్చు.
  • ఆ తర్వాత దరఖాస్తులో మీ వ్యక్తిగత వివరాలన్నీ నింపాలి.
  • అవసరమైన పత్రాలన్నీ జత చేయాలి. తిరిగి దరఖాస్తు ఫారాన్ని గ్రామ సచివాలయంలో సమర్పించాలి.

జగనన్న అమ్మఒడి జాబితాను ఎలా చెక్ చేసుకోవాలి?

ఇప్పుడు ఏపీ ప్రభుత్వం అమ్మ ఒడి పథకం(Jagananna Amma Vodi Scheme) అర్హుల జాబితాను ప్రతి ఏడాది విడుదల చేస్తుంది. లబ్ధిదారులు అమ్మ ఒడి అధికారిక వెబ్‌సైట్ jaganannaammavodi-ap-gov-in నుంచి అమ్మ ఒడి జాబితాని డౌన్‌లోడ్ చేసుకొని మీ పేరును చెక్ చేసుకోవచ్చు. అలాగే, లబ్ధిదారులు డబ్బును మీ ఖాతాలో పొందారా లేదా అని వారి బ్యాంక్ ఖాతాను చెక్ చేసుకోవాలి.

జగనన్న అమ్మఒడి కోసం ఎప్పుడూ దరఖాస్తు చేసుకోవాలి?

జనవరిలో అందజేసే ఈ సాయం కోసం నెల ముందుగా డిసెంబరు 10 నుంచి 20లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles