Jagananna Vidya Deevena Scheme Full Details in Telugu: భారతదేశంలో 20 శాతం మంది సరిగ్గా తినడానికి తిండి లేక ఇంకా పేదలుగానే ఉన్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో వారు తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించడానికి స్థోమత లేకపోవడంతో చాలా మంది పిల్లలు ఉన్నత విద్యకు దూరం అవుతున్నారు.
చదువుతోనే పేద ప్రజల జీవితాల రూపురేఖలు మారతాయని, పేద విద్యార్థులు కూడా ఉన్నత చదువులు చదవలన్న సమున్నత లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకమే ఈ ‘జగనన్న విద్యా దీవెన’. ఈ పథకాన్ని సీఎం 29 జూలై 2021న ప్రారంభించారు.
(ఇది కూడా చదవండి: జగనన్న అమ్మఒడి పథకం.. పూర్తి వివరాలు!)
ఈ పథకం ద్వారా వివిధ విద్యాసంస్థల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు పూర్తి ఫీజు రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. మరి ఇలాంటి పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి విద్యార్థులు కలిగి ఉండాల్సిన అర్హత ప్రమాణాలు, అవసరమైన పత్రాలు, దరఖాస్తు పత్రము మొదలైన వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.
- పథకం పేరు: జగనన్న విద్యాదీవెన
- పథకం ఎవరి కోసం: విద్యార్థుల చదువు కోసం
- లబ్ధిదారులు: రాష్ట్ర విద్యార్థులు
- ప్రారంభించిన తేది: 29 జూలై 2021
- అధికారిక వెబ్సైటు: navasakam.ap.gov.in/
ఏ విద్యార్థి వార్షిక కుటుంబ ఆదాయం రూ 2.5 లక్షలు ఉంటుందో వారు జగన్నన్న విద్యా దీవేన పథకం కింద అర్హులవుతారు. బి.టెక్, బి.ఫార్మసీ, ఎం.టెక్, ఎం.ఫార్మసీ, ఎంబీఏ, ఎంసిఎ, బిఈడి మరియు అటువంటి కోర్సులను అభ్యసించే విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ విస్తరించారు.
జగనన్న విద్యా దీవెన పథకానికి ఎవరు అర్హులు:
- కుటుంబ వార్షిక ఆదాయం సంవత్సరానికి రూ. 2.5 లక్షల కంటే తక్కువగా ఉండాలి.
- లబ్ధిదారులు 10 ఎకరాలలోపు చిత్తడి నేల లేదా 25 ఎకరాలలోపు వ్యవసాయ భూమి లేదా చిత్తడి నేల మరియు 25 ఎకరాలలోపు వ్యవసాయ భూమి మాత్రమే కలిగి ఉండాలి.
- లబ్ధిదారులు ఎటువంటి నాలుగు చక్రాల వాహనాలు(కారు, టాక్సీ, మొదలైనవి) కలిగి ఉండకూడదు.
- పారిశుధ్య కార్మికుల పిల్లలు మరియు ట్యాక్సి, ఆటో, ట్రాక్టర్‌లపై ఆధారపడిన కుటుంబాలకు చెందిన పిల్లలకు కూడా ఈ పథకం వర్తిస్తుంది.
- ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ఈ పథకానికి అర్హులు కారు.
- కుటుంబంలో ఎవరైనా పెన్షన్ పొందుతున్నట్లయితే, అతను లేదా ఆమె పథకానికి అర్హులు కాదు.
- అభయారణ్యం కార్మికులకు ఈ పథకం నుండి మినహాయింపు ఇచ్చారు.
నాలుగు త్రైమాసికాలలో (ఏప్రిల్, జూలై, డిసెంబర్, ఫిబ్రవరి) ప్రభుత్వం ఇచ్చే ఫీజుల డబ్బులను విద్యార్థి తల్లి కళాశాలలకు చెల్లించాలి. తమ పిల్లలకు నాణ్యమైన విద్య అందుతోందా? లేదా? విద్యార్థి ఎలా చదువుతున్నాడో.. అనే విషయాలను పరిశీలించేందుకు తల్లిదండ్రులు తరచూ కాలేజీలను సందర్శించాలి.
ప్రభుత్వం విద్యార్థి తల్లి ఖాతాకు ఫీజుల డబ్బులు విడుదల చేసిన వారం రోజుల్లో ఆయా కాలేజీల్లో చెల్లించాలి. అలా కాలేజీలో చెల్లించకుంటే ప్రభుత్వం బాధ్యత వహించదు. ఆ విధంగా చెల్లించకుంటే తదుపరి దఫా విద్యార్థికి జగనన్న విద్యా దీవెన పథకం కింద డబ్బులు నిలిపివేస్తారు.
జగనన్న విద్యా దీవెన స్టేటస్ చెక్ చేసుకునే విధానం:
- జ్ఞానభూమి పోర్టల్‌లో స్టూడెంట్ లాగిన్ అవ్వాలి.
- ఆ తర్వాత Login ఆప్షన్ పై క్లిక్ చేసి “Username” దగ్గర ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి Password ఎంటర్ చేయాలి.
- లాగిన్ అయితే మీ Personal Details, College Details, Scholarship, Fees Details, Status, Bank Account, Attendance లాంటి వివరాలు కనిపిస్తాయి
- పాస్వర్డ్ మరిచిపోతే https://jnanabhumi.ap.gov.in/ForgotPwd.edu లింక్ పై క్లిక్ చేయాలి.
- లింక్ ఓపెన్ చేసి “Select Your Identity – Student” అని సెలెక్ట్ చేసి , ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి , Get “Verification Code” క్లిక్ చేస్తే మీకు “OTP” వస్తుంది.
- OTP ఎంటర్ చేసాక కొత్త పాస్వర్డ్ Create చేసుకోవాలి.
- కొత్త పాస్వర్డ్ క్రియేట్ అయ్యాక లాగిన్ అయ్యి స్కాలర్షిప్, Fee Reimbursement స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.
జగనన్న విద్యా దీవెన పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకునే విధానం:
- https://jnanabhumi.apcfss.in/ మొదట ఈ పోర్టల్‌లో లాగిన్ అవ్వాలి.
- తరువాత User ID లో మీ 12 అంకెల ఆధార్ ఎంటర్ చేయండి
- పాస్వర్డ్ దగ్గర మీ password ఎంటర్ చేయండి. మీరు మొదటి సారి లాగిన్ అవుతుంటే లేదా password మర్చిపోతే నెక్స్ట్ స్టెప్ లో ఇచ్చిన విదంగా కొత్త పాస్వర్డ్ generate చేసుకోవాలి .
- పాస్వర్డ్ దగ్గర మీ password ఎంటర్ చేసి , Capcha లో ఉన్నవి అదే విదంగా type చేసి signin బటన్ పైన క్లిక్ చేయండి
- లాగిన్ అయ్యాక VIEW/PRINT SCHOLORSHIP APPLICATION STATUS ఆప్షన్ పైన క్లిక్ చేయండి
- తరువాత Application Id దగ్గర పైన ఉన్న లేటెస్ట్ మరియు సరైన విద్యా సంవత్సరాన్ని ఎంచుకోండి . ఎంచుకొని Get Application Status పైన క్లిక్ చేయండి
- క్రిందికి scroll చేస్తే మీకు ఈ విధంగా విద్యా దీవెన [RTF] మరియు వసతి దీవెన [MTF] స్టేటస్ చూపిస్తాయి
- పై విధంగా Payment Status లో Success ఉంటె Release bank details లో ఏ బ్యాంకు అకౌంట్ లో అమౌంట్ పడిందో చూపిస్తుంది .
- Bill Approved ఉండి పేమెంట్ స్టేటస్ ఇంకా అప్డేట్ కానీ వారికి ఒకటి లేదా రెండు రోజులలో అమౌంట్ పడుతుంది . ఆ తర్వాత నే స్టేటస్Success గా మారుతుంది.
- Quarter wise పేమెంట్ డీటెయిల్స్ మీరు చూడవచ్చు.
Note: ముఖ్య గమనిక : అమౌంట్ రిలీజ్ చేసాక లేటెస్ట్ క్వార్టర్ అమౌంట్ చూపించడానికి టైం పడుతుంది.