Sunday, September 15, 2024
HomeHow Toఈపీఎఫ్ఓ అధిక పెన్షన్‌ కోసం ధరఖాస్తు చేసుకోవడం ఎలా..?

ఈపీఎఫ్ఓ అధిక పెన్షన్‌ కోసం ధరఖాస్తు చేసుకోవడం ఎలా..?

How To Apply for EPF Higher Pension: ఎంప్లాయి ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌(ఈపీఎఫ్‌ఓ) సంస్థ ఉద్యోగులు ఎక్కువ పెన్షన్‌ పొందేలా కొత్త మార్గదర్శకాలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఉద్యోగులు అధిక పెన్షన్‌ పొందడానికి గరిష్ట వేతనం(బేసిక్‌ పే ప్లస్‌ డియర్‌నెస్‌ అలవెన్స్‌) నెలకు రూ.15,000 ఉండాల్సి ఉంటుంది.

(ఇది కూడా చదవండి: ఈపీఎఫ్ సబ్‌స్క్రైబర్లు పీపీవో నెంబర్ తెలుసుకోవడం ఎలా..?)

ఈపీఎఫ్ఓ అధిక పెన్షన్‌ అందించడం కోసం ఉద్యోగుల ప్రాథమిక వేతనాలపై 8.33 శాతం నగదును యజమానులు మీ ఈపీఎఫ్ఓ(EPFO) ఖాతాలో జమ చేస్తారు. గత ఏడాది నవంబర్‌ 4న సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం.. అధిక పెన్షన్‌ పొందేందుకు అర్హులైన ఉద్యోగులు ఈపీఎఫ్‌ఓలో అప్లయి చేసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులకు అనుగుణంగా ఈపీఎఫ్‌ఓ రిటైర్డ్‌ ఫండ్‌ బాడీ పోర్టల్‌ను సిద్ధం చేసింది.

ఈపీఎఫ్ఓలో అధిక పెన్షన్‌ కోసం ధరఖాస్తు(Apply) చేసుకోవడం ఎలా..?

  • మొదట అర్హులైన ఈపీఎఫ్‌ఓ ఖతాదారులు ఈ-సేవ పోర్టల్‌(e-Sewa portal)ను సందర్శించాలి
  • అందులో అధిక పెన్షన్‌ అప్లయ్‌ చేసేలా Pension on Higher Salary: Exercise of Joint Option under para 11(3) and para 11(4) of EPS-1995 on or before 3rd May 2023 అనే ఆప్షన్‌ పాపప్‌ అవుతుంది.
  • ఆ తర్వాత మీకు Click Here అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
  • ఇప్పుడు మీరు అప్లికేషన్‌ ఫారమ్‌ ఫర్‌ జాయింట్‌ ఆప్షన్‌లో యూఏఎన్‌ నెంబర్‌, పేరు, మీ పుట్టిన తేదీ, ఆధార్‌ కార్డ్‌, మొబైల్ నెంబర్ వివరాల్ని ఎంటర్‌ చేసి ఓటీపీ ఆప్షన్‌పై ట్యాప్‌ చేయాలి.
  • ఆ తర్వాత Validate User, Submit Application, Acknowledgement Number Generatedలో మీ వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది.
  • ధరఖాస్తు చేసుకున్న తర్వాత మీరు అర్హులైతే అధిక పెన్షన్‌ పొందే సౌలభ్యం కలుగుతుంది, లేదంటే రిజెక్ట్‌ అవుతుంది.
- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles