Agriculture-Land-Non-Agriculture-Land

Agricultural Land and Non- Agricultural Land: ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో వ్యవసాయ, వ్యవసాయేతర భూములకు ఎన్నో చట్టాలు అమలులో ఉన్నాయి. చాలా మందికి ఈ చట్టాల గురుంచి తెలియకపోవడంతో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

ఇలాంటి చట్టం ప్రకారం.. కొన్నిసార్లు ఉచితంగా చేసుకోవాల్సిన పనులకు కూడా ఎంతో కొంత డబ్బు చెల్లించాల్సి వస్తుంది. తెలంగాణ ప్రభుత్వం గత ఏడాది తీసుకొని వచ్చిన ధరణీ రైతులు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అందుకే మన ఈ లైవ్ బ్లాగ్ ద్వారా మనకు ఎదురయ్యే ప్రతి ప్రశ్నకు సమాధానం అందించాలని నేను ఒక ప్రయత్నిస్తున్నాను.

(ఇది కూడా చదవండి: ధరణి పోర్టల్ ద్వారా ROR-1B, పట్టాదారు పాసు పుస్తకం పొందటం ఎలా..?)

మీకు గనుక భూములకు సంబంధించి ఏమైనా ప్రశ్నలు ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ప్రశ్నకు జవాబు ఇస్తాను.

Table of Contents

ప్రశ్న: మా భూమి తెలంగాణ ధరణీ పోర్టల్లో చూపించడం లేదు ఏమి చేయాలి?

జవాబు: మీ భూమి తెలంగాణ ధరణీ పోర్టల్లో చూపించకపోతే చింతించాల్సిన అవసరం లేదు. ధరణిలో గ్రీవెన్స్ రిలేటెడ్ టు స్పెసిఫిక్ ల్యాండ్ మ్యాటర్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దీనిలో మిస్సింగ్ సర్వే నెంబర్ అనే మరోక ఆప్షన్ ఉంటుంది. దీన్ని ఎంచుకొని మీ దగ్గర ఉన్న ఆధారాలను సమర్పించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ అంత మీ సేవ ఆపరేటర్లు చేస్తారు.

ప్రశ్న: మా పట్టా భూమి ధరణిలో హౌస్ సైటుగా పడింది. ఈ భూమిని హౌస్ సైటు నుంచి తొలగించడానికి చూస్తే మా సర్వే నెంబర్ అందులో కనిపించడం లేదు ఏమి చేయాలి?

జవాబు: మీ పట్టా భూమిని హౌస్ సైటు లిస్టులో నుంచి తొలిగించడానికి ప్రయత్నించినప్పుడు సర్వే నెంబర్ కనిపించకపోతే ముందుగా మీ భూమి ప్రొహిబిటెడ్ జాబితాలో పడింది ఏమో చూడండి. ఆ జాబితాలో కూడా మీ సర్వే నెంబర్ లేకపోతే ఒకసారి మీ తహశీల్దార్ ని కలవండి.

ప్రశ్న: నాలా(NALA) కన్వర్షన్ అంటే ఏమిటి?

జవాబు: వ్యవసాయ భూమిని వ్యవసాయేతర అవసరాల కోసం వాడుకోవడానికి NALA కింద దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ మొత్తాన్ని నాలా కన్వర్షన్ అంటారు.

ప్రశ్న: మ్యూటేషన్ అంటే ఏమిటి?

జవాబు: ప్రభుత్వం దగ్గర ఉన్న అన్నీ రెవెన్యూ రికార్డులలో పాత యజమాని స్థానంలో కొత్త యజమాని(మన పేరు) పేరు చేర్చడానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ మొత్తాన్ని మ్యూటేషన్ అంటారు. ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మాత్రమే మ్యూటేషన్ చెప్పించుకోవాల్సి ఉంటుంది. మ్యూటేషన్ చేపించిన తర్వాత మాత్రమే ఆ ఆస్తి మీద సర్వ హక్కులు లభిస్తాయి.

ప్రశ్న: గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ చేయించిన కూడా మ్యూటేషన్ చేయించాలా?

జవాబు: అవును, కచ్చితంగా గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ చేయించిన భూమూలకు, ఇండ్లకు కూడా మ్యూటేషన్ చేయించాల్సి ఉంటుంది. మ్యూటేషన్ చేసిన తర్వాత మాత్రమే మనకు సర్వ హక్కులు లభిస్తాయి.

ప్రశ్న: మా భూమి రిజిస్ట్రేషన్ చేస్తే కావడం లేదు ఎందుకు?

జవాబు: మీ భూమి రిజిస్ట్రేషన్ కాకపోవడానికి ప్రధాన కారణం, మీ భూమి కచ్చితంగా ప్రభుత్వ నిషేదిత జాబితాలో ఉండి ఉండవచ్చు.

ప్రశ్న: తెలంగాణలో వ్యవసాయ భూముల మ్యూటేషన్ ఫీజు ఎంత?

జవాబు: తెలంగాణలో వ్యవసాయ భూముల మ్యూటేషన్ ఫీజు ఎకరానికి రూ.2500.

ప్రశ్న: గిఫ్ట్ డీడ్ భూమి కొనవచ్చా?

జవాబు: అవును, కొనవచ్చు. కానీ, ఒకసారి గిఫ్ట్ డీడ్ కండిషన్ ల గురుంచి పూర్తిగా తెలుసుకోండి. వారి ఇద్దరి మధ్య ఒప్పందాల గురుంచి పూర్తిగా తెలుసుకున్న తర్వాత కొనుగోలు చేయండి. కచ్చితంగా మీరు కొనుగోలు చేసే వ్యక్తి పేరు అన్నీ రెవెన్యూ రికార్డులలో ఉంటే మంత్రమే కొనుగోలు చేయండి.

ప్రశ్న: భూ యజమాని చనిపోతే ఎలా?

జవాబు: భూ యజమాని చనిపోతే, అతని కుటుంబ సభ్యులు డెత్ సర్టిఫికేట్ కోసం అప్లై చేసిన తర్వాత Succession కోసం అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ జరిగి ఉంటుందో ఆ ఆతర్వాత వారి నుంచి కొనుగోలు చేయండి.

ప్రశ్న: మిస్సింగ్ సర్వే నెంబర్ కోసం దరఖాస్తు చేసుకుంటే, మిగతా భూమికి వచ్చే రైతు బందు పథకం ఆగిపోతుందా?

జవాబు: అలా ఏమి రైతు బందు ఆగిపోదు. మిగతా భూమికి కచ్చితంగా వస్తుంది.

3 COMMENTS

  1. ఒక గ్రామంలో కూలిపోయిన ఇళ్ళు జాగను కొన్నాను (రిజిస్ట్రేషన్ అయింధి). ధానిని గ్రామపంచాయితి రికార్డుల్లో యెమైన మార్చల (మ్యూటేషన్ లాంటిధి చేయాల). నేను గ్రామ కరోబర్ ని అడుగుతే అవసరం లేధు అని అన్నాడు. ఇళ్ళు కట్టుకున్నప్పుడు చెద్ధామ్ అన్నాడు. నేను ఏమి చేయాలి ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here