తెలంగాణలో ప్రస్తుతం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకి సంబందించిన సన్నహకలు జరుగుతున్నాయి. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అందరూ ఓటు వేస్తానికి అవకాశం ఉండదు, కేవలం పట్టభద్రులు మాత్రమే ఓటు వేస్తానికి అవకాశం ఉంది. పార్లమెంటులో లోక్ సభ, రాజ్య సభ ఉన్న విదంగానే అసెంబ్లీలో శాసన మండలి, శాసన సభ ఉంటాయి. ఇప్పడు ప్రస్తుతం జరిగే ఎన్నికలు శాసన మండలికి చెందిన పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు చెందినవి.

అక్టోబర్‌ 1 నుంచి ఓటరు నమోదు ప్రక్రియ మొదలైంది. 2015 ఎన్నికల్లో ఓటర్ల జాబితాను పూర్తిగా రద్దు చేసిన నేపథ్యంలో.. 2017 నాటికి పట్టభద్రులైన వారు అక్టోబర్‌ 1 నుంచి ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఓటరు నమోదుకు నవంబర్‌ 11 వరకు వరకు గడువు ఉంది. డిసెంబర్‌ 1న ఓటరు ముసాయిదాను ప్రకటిస్తారు. తుది ఓటర్లు జాబితాను జనవరి 18 ప్రకటించనున్నారు.

సాదారణ ఎన్నికల్లో ఓటు వేయడానికి 18 ఏళ్ల వయస్సు ఉంటే చాలు కానీ ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయడానికి మాత్రం 18 ఏళ్ల వయస్సుతో పాటు ఈ ఎన్నికకు సంబందించిన cut – off వరకు కనీసం డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. మీరు ఏ నియోజకవర్గానికి చెందిన వారో ఆ నియోజకవర్గానికి సంబందించిన చిరునామా పత్రాలు ఉదా: ఆధార్ కార్డ్, ఓటర్ కార్డ్, నివాస దృవీకరణ పత్రం మొ.వి కలిగి ఉండాలి. అసలు ఏ డిగ్రీ ఉంటే వీటికి అర్హులు అనేది తెలుసుకోవాలంటే అవిభాజ్య ఆంధ్ర ప్రదేశ్ 2006 సెప్టెంబర్ లో జారీ చేసిన జీ. వో నెంబర్ 536లో డిగ్రీలకు సంబందించిన వివరాలు ఉన్నాయి. మీకు ఈ జీ. వో అనేది అంతర్జాలంలో అందుబాటులో ఉంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు జాబితా అనేది ప్రతి ఏడాది కొత్తగా తయారు చేస్తారు. అందుకని మనం ప్రతిసారి కొత్తగా పేరు(గతంలో ఓటు వేసినవారు కూడా) నమోదు చేసుకోవాలి. ఓటరు నమోదు కోసం ఆఫ్ లైన్ లో వచ్చేసి మీ మండలంలో ఎన్నికలకు సంబందించిన అధికారికి పత్రాలు పూర్తి చేసి, డిగ్రీ, చిరునామా సంబందించిన అందజేయలి. అలాగే ఒక సంస్థకు, కాలేజీకి సంబందించిన వ్యక్తులు ఓకే ఫామ్ నెంబర్ – 18లో అన్నీ వివరాలు పూర్తి చేసి ఒకే సారి సంబందిత ఎన్నికల అధికారికి పూర్తి చేసి అందజేస్తే సరిపోతుంది. ఇది ఒక ప్రభుత్వ, ప్రైవేట్, కాలేజీలకు మాత్రమే అవకాశం ఉంది. అయితే ఎన్నికల్లో ఓటు వేయడానికి ఓటర్ల జాబితాలో పేరు నమోదు చేసుకోవడాని ఎలానో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

మనం ఆన్ లైన్ లో ఓటర్ల జాబితాలో పేరు నమోదు చేసుకోవడానికి https://ceotelangana.nic.in/ ధరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ లో జాబితాలో ఈ క్రింద తెలుసుకోండి.

  • వెబ్ సైట్ ఓపెన్ చేశాక మీకు అక్కడ current issues లో MLC Graduate అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే మీకు అక్కడ SCHEDULE FOR MLC GRADUATES, INSTRUCTIONS అనే ఆప్షన్ లు కనిపిస్తాయి.
  • మనం INSTRUCTIONS అనే ఆప్షన్ ని క్లిక్ చేస్తే మీకు అక్కడ Online Registration Form-18 (GRADUATES) అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే మీకు Form – 18 పేజీ ఓపెన్ అవుతుంది.
  • Form-18 (GRADUATES) పేజీలో మీకు సంబందించిన పట్టభద్రుల నియోజకవర్గంను ఎంచుకోవాలి. అలాగే దానితో పాటు మీ యొక్క జిల్లాను కూడా ఎంచుకోండి.
  • తర్వాత కాలంలో మీ అప్లికేషన్ వివరాలు పొందుపరచాల్సి ఉంటుంది. మీ పేరు, తండ్రి పేరు, లింగం, విద్య అర్హత, పుట్టిన తేదీ, వృత్తి మొ..వి నింపాల్సి ఉంటుంది.
  • తర్వాత వచ్చేసి మీ ఇంటి అడ్రస్, వీధి పేరు, గ్రామం పేరు, పోస్ట్ ఆఫీసు, పిన్ కోడ్ తదితర వివరాలు సమర్పించాల్సి ఉంటుంది.
  • తర్వాత కాలంలో మీరు జిల్లా పేరు, నిజయోకవర్గం పేరు, ఎపిక్ కార్డ్ నెంబర్, డిగ్రీ/డిప్లొమా లాంటి వివరాలను పొందుపర్చాలీ.
  • పేజీలో పత్రాలు అప్లోడు చేసేటప్పుడు మీ డిగ్రీకి సంబందించిన పత్రాన్ని 200KB లోపు, ఫోటో వచ్చేసి 100KB లోపు JPG, JPEG Format లోపు స్కాన్ చేసి అప్లోడు చేయాల్సి ఉంటుంది.  
  • తర్వాత కాలంలో మీ మొబైల్ నెంబర్, ఈ – మెయిల్ వంటి వివరాలను అందజేస్తే మీకు ఒక అప్లికేషన్ ఐడీ నెంబర్ వస్తుంది. దాని ద్వారా మీరు మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవచ్చు.

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. ప్రభుత్వ సేవల మరియు టెక్నాలజీ పరిజ్ఞానం యొక్క తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.