తెలంగాణలో వ్యవసాయేతర ఆస్తుల, భూముల రిజిస్ట్రేషన్లు సోమవారం (డిసెంబర్ 14) నుంచి ప్రారంభమయ్యాయి. అయితే, ప్రజలు కొత్త విదానంతో ఇబ్బందులు పడుతునట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న హైకోర్టు వినియోగదారుల ఆధార్ వివరాలు, పీటీఐఎన్ నెంబర్ ఆడగొద్దని ప్రభుత్వాన్ని కోరింది. హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ప్రభుత్వం నేడు స్లాట్ బుకింగ్ ప్రక్రియను నిలిపివేస్తూ కిలక నిర్ణయం తీసుకుంది. అయితే, గతంలో స్లాట్ బుకింగ్ చేసుకున్నవారు యాదావీధిగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపింది. కొత్త వారు మాత్రం పాత పద్దతిలోనే సోమవారం నుండి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అన్నారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అధికారులు రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగేవిదంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజలు ఎలాంటి అసౌకర్యానికి గురికాకూడదని కోరారు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here