తెలంగాణలో ధరణి పోర్టల్ సేవలు ఇప్పటికే ప్రారంభమైన విషయం తెలిసిందే. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ప్రక్రియను ఆన్‌లైన్ వేదికగా ధరణి పోర్టల్ ద్వారానే నిర్వహిస్తున్నారు. కొన్ని టెక్నికల్ అవరోదలు తప్ప మిగత అన్నీ సజావుగా జరగడంపై సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఆ చిన్న అవరోదలను కూడా వీలైనంత త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అయితే, ఇప్పుడు తాజాగా వ్యవసాయేతర భూముల రిజిష్ర్టేషన్‌పైనా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు సీఎం కేసీఆర్. వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను నవంబర్ 23 నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు. ఇప్పటికే తన చేతుల మీదుగా ధరణి పోర్టల్ ప్రారంభం అయిన నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్‌ను లాంచ్ చేస్తారని కేసీఆర్ వెల్లడించారు. ధరణి పోర్టల్‌ను అద్భుతంగా తీర్చిదిద్దినందుకు అధికారులను అభినందించారు సీఎం కేసీఆర్.(చదవండి: శుభవార్త.. భారత్‌లోకి త్వరలో రాబోతున్న షార్ట్ వీడియో యాప్‌)

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. ప్రభుత్వ సేవల మరియు టెక్నాలజీ పరిజ్ఞానం యొక్క తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.