ప్రజల నుండి వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో ఎల్‌ఆర్‌ఎస్ రిజిస్ట్రేషన్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యవసాయేతర భూములకు సంబంధించిన ఎల్ఆర్ఎస్ నిబంధనను తొలగిస్తునట్లు ప్రభుత్వం ప్రకటించింది. అధీకృత లేఅవుట్లలో లేదా మునుపటి ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్స్ కింద రెగ్యులరైజ్ చేయబడిన మునుపటి బిల్డింగ్ పెనలైజేషన్ స్కీమ్ (బిపిఎస్) లేదా భవనం కింద ఉన్న భవనాలు లేదా నిర్మాణాలలో ఓపెన్ ప్లాట్ల నమోదుకు ఎటువంటి పరిమితి లేదని రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇంకా చదవండి: వాహనదారులకు శుభవార్త చెప్పిన కేంద్రం

రిజిస్ట్రేషన్ అయిన వాటికి తదుపరి రిజిస్ట్రేషన్ కొనసాగించవచ్చుఅని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. ఇంకా అనుమతులు లేని, క్రమబద్ధీకరణ కాని కొత్త ప్లాట్లకు మాత్రం రిజిస్ట్రేషన్లు చేసేందుకు అనుమతి ఇచ్చేదీ లేదని పేర్కొంది. కొత్తగా చేసిన ప్లాట్లకు మాత్రం ఎల్ఆర్ఎస్ ఖచ్చితంగా కలిగి ఉండాలి అనే నిబంధనను విధించింది. అయితే కొత్త లేఔట్ అనే దానిపై ఎటువంటి వివరణ ఇవ్వలేదు. అయితే ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ను పూర్తిగా తొలిగించినట్లు మాత్రం పేర్కొనలేదు. అనుమతులు ఉన్న క్రమబద్దీకరణ అయిన ప్లాట్ల ఎల్ఆర్ఎస్ యాద విధిగా కొనసాగుతాయని పేర్కొంది.

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్(YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here