తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త తెలిపింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 91 వేలకు పైగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో 11 వేలకు పైగా కాంట్రాక్ట్ ఉద్యోగుల కూడా ఉన్నారని పేర్కొంది. వారిని నేరుగా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. మిగతా 80 వేల పైచిలుకు పోస్టులకు అతి త్వరలో నోటిఫికేషన్ భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
ఈ మొత్తం ఉద్యోగులలో 95 శాతం ఉద్యోగాలు స్థానిక అభ్యర్ధులకు మాత్రమే దక్కనున్నట్లు తెలిపింది. మిగతా 5 శాతం ఉద్యోగాలలో కూడా 1 నుంచి 2 శాతం స్థానికులకు లభిస్తాయని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. మొత్తంగా 97 శాతం స్థానిక యువతకు ఉద్యోగాలు లభిస్తాయని సీఎం తెలిపారు. 95 శాతం లోకల్ కోటాతో రాష్ట్రపతి ఉత్తర్వులు సాధించామని అన్నారు.
