రెవెన్యూ సేవలను సులభంగా, పారదర్శకంగా అందించాలని ఉద్దేశ్యంతో తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న ధరణి పోర్టల్ ను సీఎం కేసీఆర్ అక్టోబర్ 29న మేడ్చ‌ల్ జిల్లా మూడు చింత‌ల‌ప‌ల్లి గ్రామంలో ప్రారంభించారు. ధ‌ర‌ణి పోర్ట‌ల్ ప్రారంభం కంటే ముందు సీఎం కేసీఆర్ ప్ర‌త్యేక పూజ‌లు చేశారు.

ఈ ధరణి పోర్టల్ పనితీరు, వినియోగంపై ఇప్పటికే తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లు, ధరణి ఆపరేటర్లకు శిక్షణ కూడా ఇచ్చారు. భూముల రిజిస్ట్రేషన్ కోసం ధరణి పోర్టల్ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం స్లాట్ బుక్ చేసుకున్న సమయానికి ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్తే అక్కడ మనకు కేవలం 10 నిమిషాలలో రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ప్రక్రియ జరిగిపోతుంది. గతంలో భూముల రిజిస్ట్రేషన్ కోసం పేజీలకు పేజీల డాక్యుమెంట్లు, పత్రాలకు కాకుండా ఇప్పుడు పనులు వేగవంతం కానున్నాయి. ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తూ భూమి యజమానుల వివరాలు కనిపించేలా ధరణి వెబ్‌సైట్‌ను రూపొందించారు. నవంబర్ 2 నుంచి తెలంగాణలో రిజిస్ట్రేషన్లు ప్రారంభం అవుతాయి. తద్వారా తెలంగాణలోని సాగు భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఇక సులభతరం కానుంది. నేటి నుండి భూముల రిజిస్ట్రేషన్ కోసం ధరణి పోర్టల్ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవచ్చు.

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. ప్రభుత్వ సేవల మరియు టెక్నాలజీ పరిజ్ఞానం యొక్క తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here