రైతు రుణాల మాఫీకి సంబంధించి తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు ఇప్పటివరకు రూ.25 వేల లోపు పంట రుణాలను మాఫీ చేసిన ప్రభుత్వం, కరోనా మహమ్మారి కారణంగా నిలిచిపోయిన ప్రక్రియను తిరిగ పునరుద్ధరించాలని నిర్ణయించింది. ఆగస్టు 15వ తేదీ నుంచి నెలాఖరు వరకు రూ. 50 వేల వరకు ఉన్న పంట రుణాలను మాఫీ చేయాలని మంత్రివర్గం అధికారులను ఆదేశించింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు పంట రుణ మాఫీకి సంబంధించిన వివరాలను ఆర్థిక శాఖ కేబినెట్‌కు అందించగా.. దానిపై చర్చించింది.
రాష్ట్ర కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల మంది రైతులకు లబ్ది చేకూరనుంది. రూ.25 వేల లోపు పంట రుణాలను మాఫీ చేయడం ద్వారా రాష్ట్రంలో 3 లక్షల మందికి మేలు జరగగా, తాజా నిర్ణయంతో మొత్తంగా ఈ సంఖ్య 9 లక్షలుకు చేరుకుంది. మిగతా రుణమాఫీ ప్రక్రియను కూడా దశలవారీగా కొనసాగించాలని కేబినెట్ నిర్ణయించింది. అలాగే, వ్యవసాయంపై ప్రధానంగ చర్చించిన కేబినెట్.. సాగులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని అధికారులను ఆదేశించింది.
Support Tech Patashala
