దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి భారీ నుంచి పేదలు ఇంకా పూర్తిగా కోలుకోని నేపథ్యంలో ప్రస్తుతం అందిస్తున్న ఉచిత బియ్యం పంపిణీని కేంద్రం ప్రభుత్వం నవంబర్ వరకు పొడగించిన సంగతి తెలిసిందే. రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి 5 కిలోల ఉచిత బియ్యాన్ని అందిస్తుంది. రాష్ట్రంలో కూడా కరోనా మహమ్మరి ప్రభావం ఇంకా తగ్గని కారణంగా ప్రస్తుతం అందిస్తున్న ఉచిత బియ్యం పంపిణీని కొనసాగించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

కేంద్ర ప్రభుత్వం జాతీయ ఆహార చట్టం పరిధిలోకి వచ్చే లబ్ధిదారులకు అందిస్తున్న 5 కిలోల బియ్యానికి అదనంగా మరో 5 కిలోలు కలిపి మొత్తంగా 10 కిలోల ఉచిత బియ్యాన్ని నవంబర్‌ వరకు అందించనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. జూలై ఒకటి నుంచి 10కిలోల ఉచిత బియ్యం పంపిణీకి సంబంధించి ఇప్పటికే అన్ని జిల్లాల అధికారులకు పౌర సరఫరాల శాఖ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఖజానాపై కనీసం రూ.700 కోట్ల మేర భారం పడే అవకాశం ఉంది.

Support Tech Patashala

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here