Wednesday, March 27, 2024
HomeGovernmentవృద్దులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త!

వృద్దులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త!

అసెంబ్లీలో దళిత బంధు పథకం చేసిన వ్యాఖ్యలతో ప్రతిపక్షాలను ఇరకాటంలో నెట్టేసిన ముఖ్యమంత్రి కేసీఆర్. ఇంటి స్థలం ఉన్నవారికి ఇళ్లు నిర్మించుకునేందుకు కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. మరికొద్ది రోజుల్లో ఇంటిస్థలం ఉన్న పెద ప్రజలకు కొత్త ఇల్లు కట్టుకునేవారి కోసం మరో కొత్త పథకాన్ని ప్రకటించుననునట్లు తెలిపారు. అలాగే, కొత్త పింఛన్ల కోసం రోజుల తరబడి ఎదురుచూస్తున్న వృద్దులు శుభవార్త అందించారు.

57 ఏళ్లు నిండిన వారి నుంచి నూతన పింఛన్ల కోసం దరఖాస్తులు స్వీకరించాలని కేసీఆర్ సర్కార్ నిర్ణయించింది. వచ్చే సోమవారం అక్టోబర్ 11వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. నూతన పింఛన్ల మంజూరుకు సంబంధించి ఏళ్లుగా సందిగ్ధత నెలకొంది. కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం లేకపోయింది. ప్రభుత్వం తాజా నిర్ణయంతో వేలాది మంది వృద్ధులకు ప్రయోజనం కలగనుంది. పెన్షన్ కోసం దగ్గరలోని మీ సేవ కేంద్రాలకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం తెలిపింది.(చదవండి: ధరణి సమస్యలపై ఫిర్యాదు చేయాలా..? ఇదిగో ఇలా చేయండి)

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles