తెలంగాణలో గతంలో దరఖాస్తు చేస్తున్న వారికి కొత్త రేషన్ కార్డులు అందిస్తామని కొద్దిరోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ ప్రక్రియను వేగవంతం చేసింది. అర్హులైన వారిని గుర్తించే పనిలో భాగంగా ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరి వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. తాజాగా రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీపై ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన సొంత నియోజకవర్గమైన సిరిసిల్లలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్.. ఈ నెల 5వ తేదీ నుంచి కొత్త రేష‌న్ కార్డులు జారీ చేయనున్నట్లు తెలిపారు.

తెలంగాణ వచ్చిన తరువాత ఆస‌రా పెన్షన్లను పది రెట్లు పెంచామని అన్నారు. 57 ఏండ్లు నిండిన వారికి త్వరలోనే పెన్షన్లు అందజేయనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. రేషన్ కార్డుల జారీని వేగవంతం చేయాలని మంత్రి గంగుల కమలాకర్, అధికారులకు ఆదేశించారు. కొత్త రేషన్ కార్డుల జారీపై అధికారులతో మంత్రి గంగుల సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 4,15,901 రేషన్ కార్డు దరఖాస్తులు విచారణ తుదిదశకు చేరుకున్నట్లు మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. జిల్లాల వారీగా ధృవీకరణ ప్రక్రియ వేగంగా జరుగుతున్నట్లు చెప్పుకొచ్చారు. కొత్త కార్డుల వల్ల ప్రభుత్వంపై ఎంత భారం పడినా రెడీగా ఉన్నట్లు తెలిపారు.(ఇది కూడా చదవండి: ఎల్‌పీజీ గ్యాస్ వినియోగదారులకు భారీ షాక్!)

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.