తెలంగాణ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నేటి నుంచి యాసంగి సీజన్‌కు సంబంధించి 66.61 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతు బందు నగదును జమ చేయనున్నట్లు తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 152.91 లక్షల ఎకరాలకు రూ.7,645.66 కోట్లు పంపిణీ చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ప్రకటించారు. ఎకరం భూమి ఉన్న రైతులకు 28న, 2 ఎకరాల భూమి ఉన్న రైతులకు 29న, మూడెకరాలు భూమి రైతులకు 30నఇలాగే రోజుకో ఎకరం పెంచుతూ అందరి ఖాతాల్లో నగదు జమ అయ్యే వరకు రైతు బందు వ్యవసాయ శాఖ మంత్రి చెప్పారు.
రైతు పథకం నేటితో అరుదైన మైలురాయిని చేరుకుంది. రైతుబంధు పథకం ప్రారంభమైనప్పటి నుంచి 7 విడతల్లో రైతుల ఖాతాల్లో రూ.43,036.63 కోట్లు జమ చేశారు. ఈ సీజన్‌తో కలిపితే రూ.50 వేల కోట్ల మైలురాయిని అందుకోనుంది. రైతుబంధు పథకాన్ని ప్రపంచంలోని అత్యుత్తమ 20 పథకాల్లో ఒకటిగా రోమ్‌లో 2018 నవంబరులో జరిగిన అంతర్జాతీయ సదస్సులో ఎఫ్‌ఏవో గుర్తించిన విషయాన్ని మంత్రి నిరంజన్‌రెడ్డి గుర్తు చేశారు. రైతులకు ఆర్ధిక సహాయం చేసేందుకు, అప్పుల ఊబిలో కూరుకోకుండా ఉండేందుకు ప్రతి ఏడాది ఎకరాకు రూ. 5 వేల చొప్పున ప్రభుత్వం జమ చేస్తుంది.
(చదవండి: పీఎం కిసాన్ రైతులకు శుభవార్త.. ఖాతాలో 10వ విడత డబ్బులు పడేది అప్పుడే!)