తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ మరో కిలక నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ అమలు చేస్తున్న “ఆయుష్మాన్ భారత్” ఆరోగ్య బీమా పథకంతో తెలంగాణ రాష్ట్ర “ఆరోగ శ్రీ” ఆరోగ్య పథకాన్ని అనుసంధానం చేయడానికి సీద్ధంగా ఉందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ముఖ్య కార్యదర్శి సోమేష్ కుమార్, ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు నిర్ణయం ఈ తీసుకున్నట్లు కేంద్రానికి తెలియజేశారు.

ఇంకా చదవండి: కొత్త పాన్ కార్డు ఇంట్లో నుంచి పొందండి ఇలా?

అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో నిర్వహించిన సమావేశానికి మోడీ అధ్యక్షత వహించారు. వివిధ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పురోగతిని, ఆయుష్మాన్ భారత్ (ప్రధాన్ మంత్రీ జన ఆరోగ్య యోజన -పీఎంజె), జల్ జీవన్ మిషన్ వంటి అంశాలను ఆయన సమీక్షించారు. తెలంగాణ ప్రభుత్వం గతంలో పేదల కోసం కేంద్రం తీసుకొచ్చిన ‘ఆయుష్మాన్ భారత్ ‘ పథకంలో చేరడానికి నిరాకరించింది. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీ చాలా మంచి పథకం అని మరియు లబ్ధిదారులకు మరింత కవరేజీని లభిస్తుంది అని పేర్కొంది.

శాసనసభలో 2019-20 రాష్ట్ర బడ్జెట్‌పై జరిగిన చర్చల సందర్భంగా 85 లక్షల కుటుంబాలకు ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. దీని కోసం రాష్ట్రం సంవత్సరానికి రూ.1,330 కోట్లు ఖర్చు చేస్తోంది అని పేర్కొన్నారు. కేంద్ర ఆరోగ్య పథకం పోల్చితే 26 లక్షల కుటుంబాలకు సంవత్సరానికి సుమారు రూ.250 కోట్ల మేరకు ప్రయోజనాలను అందిస్తుంది అని తెలిపింది.

“ఆయుష్మాన్ భారత్” కింద కోవిడ్ -19 చికిత్స

ఆరోగ్యశ్రీని అమలు చేసే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే ఆయుష్మాన్ భారత్ పథకంలో చేరింది. దేశంలో కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కేంద్రం ముందుగానే తీసుకున్న కోవిడ్ -19 చికిత్స ఖర్చులను కూడా కేంద్ర పథకం భరిస్తుంది. ఈ సమావేశంలో ప్రధాని మాట్లాడుతూ.. ఆయుష్మాన్ భారత్‌లో 100 శాతం నమోదు కోసం అన్ని రాష్ట్రాలు తొందరగా కృషి చేయాలని అన్నారు. 2024 నాటికి అన్ని గృహాలకు ట్యాప్ కనెక్షన్ల ద్వారా సురక్షితమైన మరియు తగినంత తాగునీటిని అందించాలని అన్నీ రాష్ట్రాలను కోరారు. జల్ జీవన్ మిషన్ క్రింద నిర్ణయించుకున్న లక్ష్యాలను సాధించడానికి రోడ్‌మ్యాప్ రూపొందించాలని ఆయన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించారు.

తెలంగాణ ప్రభుత్వ ” మిషన్ భగీరథ” పథకం గురుంచి మోడీ సమావేశంలో ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు సీఎస్ తెలిపారు. తెలంగాణలో 98.5 శాతం గృహాలు సురక్షితమైన తాగునీటితో కవర్ అయ్యాయని భారత ప్రభుత్వం గుర్తించిందని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో మొత్తం రూ.1లక్ష కోట్ల వ్యయంతో చేపడుతున్న పలు ప్రాజెక్టులను సమీక్షించారు. రైల్వే, రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖల ప్రాజెక్టులతో పాటు గృహ, పట్టణ వ్యవహారాలపై చర్చించినట్లు కేంద్రం ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది.

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్(YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.