యాసంగీ సీజన్ సంబందించిన రైతుబంధు నగదును రైతుల ఖాతాలోకి జమ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 28 నుంచి ఎకరానికి రూ. 5 వేల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాల్లో రూ.7,300 కోట్ల నిధులను జమ చేసేందుకు సిద్దం అయ్యింది. ఈ యాసంగీ సీజన్ లో 59 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయాన్ని అందజేయనున్నారు. గత ఏడాది 57.62 లక్షల మంది రైతులకు రైతుబంధు సాయాన్ని అందజేయగా.. ఈ సారి 1.70 లక్షల మంది రైతులు అదనంగా లబ్దిపొందనున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఇంకా చదవండి: రైతుల అకౌంట్లోకి పీఎం కిసాన్ 2వేల రూపాయలు
గతంలో ఎదురైన సాంకేతిక సమస్యలను పరిష్కరించడంతో కొత్తగా పాస్ పుస్తకాలు పొందిన రైతులు ఈ ఏడాది కొత్తగా జాబితాలో చేరారు. యాసంగీ సీజన్ పెట్టుబడి సాయాన్ని ఈ నెల 27 నుంచి పది రోజుల పాటు తక్కువ భూమి విస్తీర్ణం గల రైతుల నుండి మొదలు పెట్టి పది రోజుల్లో అందరి రైతుల ఖాతాల్లో నగదు జమ చేయాలని సీఎం కేసీఆర్ వ్యవసాయ, ఆర్థికశాఖ అధికారులను ఆదేశించారు. అయితే, ఈ నెల 27వ తేదీ ఆదివారం కావడంతో రైతుబంధు నగదును సోమవారం(28వ తేదీ) నుండి ఖాతాల్లోకి జమ చేయనున్నారు. బ్యాంకుల నుంచి రైతులు నగదును విత్ డ్రా చేసుకునే సమయంలో కోవిడ్ నిబందనలు పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయశాఖ కార్యదర్శి బీ.జనార్దన్‌రెడ్డి కలెక్టర్లు, జిల్లా వ్యవసాయాధికారులను ఆదేశించారు. ఒకవేల ఎవరైనా నగదును పొందలేకపోతే మండల వ్యవసాయ అధికారులను సంప్రదించాలని అధికారులు తెలిపారు. రైతులకు వ్యవసాయం కోసం పెట్టుబడి కోసం నగదు రూపంలో అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకమే రైతుబంధు పథకం. ఈ పథకాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు మే 10, 2018న కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలోని శాలపల్లి-ఇందిరానగర్ వద్ద ప్రారంభించారు.
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్(YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.
Jai kcr