ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ సేవలను కల్పించాలని భావిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి మరో ఎదురు దెబ్బ తగిలింది. ధరణిలో వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై విధించిన స్టేను డిసెంబర్ 3కీ పొడగించింది. ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల నమోదు, రిజిస్ట్రేసన్లు, మ్యుటేషన్లపై అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ హైకోర్టులో దాఖలైన పిటిషన్ లను హైకోర్టు గత కొంత కాలంగా విచారిస్తూ వస్తుంది. ధరణి పోర్టల్ ద్వారా జరిపే రిజిస్ట్రేషన్ ప్రక్రియను నిలిపివేయాలని మద్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ స్టేను ఎత్తివేయాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ హైకోర్టును కోరారు. స్టే విషయంపై రేపు వాదనలను కొనసాగించాలని అడ్వొకేట్ జనరల్ కోరగా.. తన విన్నపాన్ని తిరస్కరించి ఆ కేసు విచారణను డిసెంబర్ 3కి వాయధా వేసింది. (చదవండి: పబ్ జీ గేమ్ టోర్నీలో గెలిస్తే రూ. 6కోట్లు మీవే!)