తెలంగాణ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. వానాకాలం కాలంలో రాబోయే పంట వరిధాన్యం కొనుగోలుకు సేకరణ విదానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వరి ధాన్యం కొనుగోలు కోసం రాష్ట్ర వ్యాప్తంగా 5,690 కేంద్రాలను ఏర్పాటు చేస్తునట్లు తెలిపింది. ఐకేపీ, పీఏసీఎస్, డీసీఎంఎస్‌ కేంద్రాల ద్వారా ఈ కొనుగోలు చేసేలా ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. జీసీసీ, ఏఎంసీ కేంద్రాల ద్వారా పౌరసరఫరాల శాఖ, హాకా ద్వారా ఫూర్వ 9 జిల్లాలో(హైదరాబాద్ కాకుండా) వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తునట్లు తెలిపింది. అంతే కాకుండా, ఏ-గ్రేడ్‌ వరికి రూ. 1,888, సాధారణ రకం ధాన్యానికి రూ.1,868 కనీస మద్దతు ధరను ప్రకటించింది. ఈ ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను పర్యవేక్షించాలని కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.(చదవండి: వారం రోజుల్లో 84 లక్షలు సంపాదించిన టెక్ డిజైనర్)

సీఎంఆర్ బియ్యాన్ని 15 రోజుల్లోగా మిల్లర్ల ప్రభుత్వానికి అందించాలని ఆదేశించింది. సకాలంలో బియ్యం అందించని మిల్లర్లపై తగిన చర్యలను తీసుకోవాలని ఆదేశించింది. పీడిఎస్ బియ్యాన్ని పక్కదారి పట్టించే మిల్లర్లను బ్లాక్ లిస్ట్ లో పెట్టి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. మిల్లర్ల ద్వారా వచ్చే బియ్యాన్ని ప్రజా పంపిణీ వ్యవస్థ, ఇతర ప్రభుత్వ కార్యక్రమాలకు వినియోగించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ధాన్యం సేకరణ, సంబంధిత అంశాల కోసం టోల్‌ ఫ్రీ నంబర్ 1800-425-00333, 1967ని సంప్రదించాలని సూచించింది. వానాకాలంలో 90 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. ప్రభుత్వ సేవల మరియు టెక్నాలజీ పరిజ్ఞానం యొక్క తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here