జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారం తుది దశకు వచ్చాయి. రేపటితో ఈ ఎన్నికల ప్రచారం మూగయనుంది. డిసెంబర్ 1వ తేదీన జీహెచ్‌ఎంసీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. అయితే డిసెంబర్ 1 జరిగే పోలింగ్ రోజు ఓటు వేయడానికి మీ దగ్గర వోటర్ ఐడి కార్డు లేకుంటే ఏమి పర్వాలేదు. ఓటరు గుర్తింపు కార్డుకు ప్రత్యామ్నాయంగా మరో 18 గుర్తింపుకార్డుల్లో ఏదో ఒకదాన్ని చూపినా ఓటు వేసేందుకు అనుమతిస్తామని జీహెచ్‌ఎంసీ ఎన్నికల అథారిటీ లోకేశ్‌కుమార్‌ స్పష్టం చేశారు.

ఓటు వేసేందుకు ముందు పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్లు గుర్తింపు నిర్ధారణకు వాటిని చూపాల్సి ఉంటుందన్నారు. ఈ 18 రకాల గుర్తింపు కార్డులైన ఆధార్‌, పాస్‌పోర్టు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఫొటోతో కూడిన సర్వీస్‌ ఐడెంటిటీ కార్డు, ఫొటోతో కూడిన బ్యాంకు పాస్‌బుక్‌, రేషన్‌కార్డు, కులధ్రువీకరణ పత్రం, స్వాతంత్ర్య సమరయోధుల గుర్తింపు కార్డు, అంగవైకల్యం ధ్రువపత్రం, పట్టాదారు పాసుపుస్తకం, పాన్‌కార్డు, ఎన్‌పీఆర్‌ స్మార్ట్‌కార్డు, జాబ్‌కార్డు, హెల్త్‌కార్డు, ఫొటోతో కూడిన పింఛను డాక్యుమెంట్‌ వంటివి ఏవి ఉన్నా చెల్లుబాటు అవుతాయని లోకేశ్‌కుమార్‌ తెలిపారు. (చదవండి: పింఛన్‌దారులకు ఈపీఎఫ్‌వో శుభవార్త!)

నగర ఓటర్లలో అధిక శాతం మందికి మొబైల్ ఫోన్‌లు ఉండడం వల్ల అర చేతిలోనే ఓటరు పోలింగ్ బూత్, ఓటర్ స్లిప్‌ను డౌన్ లోడ్ చేసుకునే విధంగా ఈ మొబైల్ యాప్‌ను రూపొందించింది. మై జీహెచ్ఎంసీ (My GHMC)’ యాప్‌లో నో-యువర్ పోలింగ్ స్టేషన్ అప్షన్లో క్లిక్ చేసి ఓటరు పేరు, వార్డు పేరు ఎంటర్ చేస్తే ఓటరు స్లిప్‌తో పాటు పోలింగ్ బూత్ ఎక్కడవుందో గూగుల్ మ్యాప్ లొకేషన్ వస్తుంది. పేరుకు బదులుగా ఓటర్ గుర్తింపు కార్డు నెంబర్, వార్డు పేర్లు ఎంటర్ చేసినా ఓటర్ స్లిప్, పోలింగ్ కేంద్రం గూగుల్ మ్యాప్ వస్తుంది.

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here