Telangana New Ration Card Latest Update: మీరు కొత్త రేషన్ కార్డు తీసుకోవాలని అనుకుంటున్నారా? అయితే, మీకు అదిరిపోయే శుభవార్త. కొత్త రేషన్ కార్డుల విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. జనవరిలో జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో చాలా మంది కొత్త రేషన్ కార్డు కోసం తెల్ల కాగితంపై రాసి దరఖాస్తు పెట్టుకున్నారు.
ఇంకా రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకొనివాళ్లు చాలా మంది ఉన్నారు. అయితే రేషన్ కార్డుల జారీ విషయంలో ఒక విధానపరమైన నిర్ణయం తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మార్చి 12న జరగనున్న తెలంగాణ కేబినెట్ భేటీ సమావేశంలో కొత్త రేషన్ కార్డు(New Ration Card)ల మంజూరుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇప్పటికే ఈకేవైసీ ప్రక్రియ గురించి పౌరసరఫరాల శాఖ నుంచి వివరాలను సేకరించింది. మరోవైపు తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి రేవంత్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. రేషన్ కార్డు ఉండి.. 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడిన జీరో కరెంట్ బిల్లులు రాకపోతే అలాంటి వారు బిల్లులు కట్టాల్సిన అవసరం లేదని డిప్యూటీ సీఎం భట్టి వెల్లడించారు. అర్హతలు ఉండి జీరో బిల్లులు రానివారు మరోసారి దరఖాస్తు చేసుకోవాలని తాజాగా సూచించారు.