మీ వాహనంపై ఏదైనా ఒక చలానా పెండింగ్‌లో ఉన్నా వాహనాన్ని జప్తు చేసే అధికారం ట్రాఫిక్ పోలీసులకు లేదని తెలంగాణ హైకోర్టు పేర్కొన్నట్లుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పోస్టు అవాస్తవమని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు. హైకోర్టు ఆ దిశగా ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని తెలిపారు. ట్రాఫిక్ పోలీసుల విధులకు ఆటంకం కలిగించి విధంగా, ప్రజలను గందరగోళానికి గురి చేస్తూ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడాన్ని ఆపేయాలని హెచ్చరించారు.
సెంట్రల్ మోటార్ వెహికిల్ రూల్స్(సీఎంవీఆర్)-1989 రూల్ 167 ప్రకారం 90 రోజులకు పైగా ఒక వాహనంపై ట్రాఫిక్ చలానాలు పెండింగ్ ఉంటే ఆ వాహనాలను జప్తు చేసే అధికారం ట్రాఫిక్ పోలీసులకు ఉన్నట్లు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. సంబంధిత పెండింగ్ చలానా గురించి వాహనదారునికి ఏ రూపంలోనైనా(ఎలక్ట్రానిక్ / కాల్) పోలీసులు ఒక్కసారైనా తెలియజేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అలాగే, ఏమైనా ట్రాఫిక్ ఉల్లంఘన చలానాలు ఉన్నాయా లేవో తెలుసుకోవలసిన బాధ్యత వాహనదారులదే. ఒకవేళ మీ వాహనంపై తప్పుగా చలానా పడిన, ఏమైనా వ్యత్యాసం ఉన్న ఆన్‌లైన్ ద్వారా అధికారులకు నివేదించవచ్చు. సాక్ష్యాలను ధ్రువీకరించి సరిదిద్దుకోవచ్చని వారు పేర్కొన్నారు.
మీకు ఏమైనా సందేహాలు ఉంటే మన టెక్ పాఠశాల టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయ్యి ఆడగవచ్చు. అలాగే మీకు తోచిన అంతా సహాయం చేసి మన పోర్టల్ ను అదుకోగలరు అని మనవి.
Support Tech Patashala
