EPFO Interest 2022-23: దీపావళి సందర్భంగా ఉద్యోగ భవిష్యనిధి సంస్థ ఈపీఎఫ్ఓ ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పీఎఫ్ వడ్డీ(PF Interest)ని దశల వారీగా ఖాతాదారుల అకౌంట్లలో జమచేస్తోంది. కొందరి ఖాతాల్లో ఇప్పటికే వడ్డీ సొమ్ము జమ అయితే.. ఇంకా.. పలువురి ఖాతాల్లో జమ కావాల్సి ఉంది.
మీ పీఎఫ్ బ్యాలెన్స్‌ను ఈపీఎఫ్ఓ(EPFO) అధికారిక ఫోర్టల్ ద్వారా, ఉమంగ్ యాప్ ద్వారా, టెక్ట్స్ మెసేజ్.. మిస్డ్ కాల్ అలర్ట్ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈపీఎఫ్ఓ వెబ్‌సైట్: మీ పీఎఫ్ ఖాతాలో ఈపీఎఫ్ వడ్డీ జమ అయ్యిందో లేదో పోర్టల్ ద్వారా తెలుసుకోవడానికి.. ముందు మీరు ఈపీఎఫ్‌ఓ వెబ్‌సైట్(https://passbook.epfindia.gov.in/MemberPassBook/login)లో లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత మీరు పనిచేస్తున్న సంస్థ నెంబర్ ఎంచుకొని బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు.
ఉమాంగ్ యాప్ ద్వారా: ముందు మీ మొబైల్లో ఉమాంగ్ యాప్(Umang App) డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత యాప్ ఓపెన్ చేసి అందులో ఈపీఎఫ్ సెక్షన్‌లోకి వెళ్లి.. వ్యూ పాస్‌బుక్ ఆప్షన్ ఎంచుకోవాలి. అనంతరం UAN నంబర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ ఆప్షన్ ఎంచుకోవాలి. ఆ తర్వాత మీ మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయాలి. అప్పుడు ఈపీఎఫ్ ఖాతా వివరాలు కనిపిస్తాయి.
మెసేజ్ ద్వారా: పీఎఫ్ ఖాతాలో ఈపీఎఫ్ వడ్డీ జమ అయ్యిందో లేదో తెలుసుకోవడానికి మీ రిజిస్టర్ మొబైల్ నంబర్ నుంచి EPFOHO అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి UAN నంబర్ ఎంటర్ చేసి.. ENG లేదా TEL లేదా HIN ఇలా లాంగ్వేజ్ ఏదైతే అది నమోదు చేసి..7738299899 నంబర్‌కు మెసేజ్ పంపాలి. మీ పీఎఫ్ బ్యాలెన్స్‌ను మెసేజ్ రూపంలో పొందుతారు.
మిస్డ్ కాల్ ద్వారా: UANతో రిజిస్టర్ అయిన మీ మొబైల్ నంబర్ నుంచి 011-22901406 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇచ్చిన తర్వాత ఫోన్‌కు ఎస్ఎంఎస్ ద్వారా పీఎఫ్ ఖాతాలో ఎంత ఉందనే మెసేజ్ వస్తుంది.