Friday, December 6, 2024
HomeBusinessGold Purity Check: బంగారం నాణ్యత ఎలా, ఎక్కడ చెక్ చేయాలో తెలుసా?

Gold Purity Check: బంగారం నాణ్యత ఎలా, ఎక్కడ చెక్ చేయాలో తెలుసా?

Gold Purity Check in Telugu: మన దేశంలో బంగారానికి ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో పెళ్లి అయినా, చిన్న పండుగైనా జరిగిన పసిడి ఆభరణాలు కొనేందుకు ఆసక్తి చూపుతారు. కష్ట సమయాలలో బంగారం చాలా ఉపయోగపడుతుంది.. పెట్టుబడి పరంగాను చాలా మంది గోల్డ్​ను కొంటారు.

అయితే, ఇలాంటి బంగారం విషయంలో కొందరు మోసపోతుంటారు. కొందరు మాయమాటలు చెప్పి బంగారమంటూ నకిలీ నగలను మనకు అంటగడుతారు. చూడటానికి బంగారంలా కనిపించినా అవి నకిలీవై ఉంటాయి.

(ఇది కూడా చదవండి: క్రెడిట్ కార్డుతో ఏటీఎంలో డబ్బులు విత్ డ్రా చేస్తున్నారా?)

అందుకే బంగారం కొనే సమయాల్లోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఏది నకిలీదో.. ఏది అసలు బంగారమో కనిపెట్టాలి. పసిడి నాణ్యతను మన ఇంట్లోనే పరీక్షించవచ్చు. ఇందుకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న మార్గాలివే.

BIS స్టాండర్డ్ మార్క్:

బంగారు ఆభరణాల నాణ్యమైనవి కావా అనేది తెలుసుకోవడానికి హాల్‌మార్క్ మొదటి సంకేతం BIS లోగో. ఈ లోగో బంగారు ఆభరణాలపై త్రిభుజం ఆకారంలో ఉంటుంది. ఈ లోగో స్టాంప్ BIS ధృవీకరించిన కేంద్రంలో బంగారు ఆభరణాల స్వచ్ఛతను తనిఖీ చేసినట్లు చూపిస్తుంది.

- Advertisement -

స్వచ్ఛత/ఫైన్‌నెస్ గ్రేడ్:

బంగారు ఆభరణాలపై హాల్‌మార్క్ రెండవ సంకేతం స్వచ్ఛతకు సంకేతం. ఈ సంకేతం ఒక నిర్దిష్ట బంగారు ఆభరణంలో బంగారం స్వచ్ఛత స్థాయిని మీకు తెలియజేస్తుంది. అలా నిర్ణయించిన బంగారం స్వచ్ఛత ఆ బంగారు ఆభరణం ధరకు ఆధారం.

ఆరు-అంకెల హాల్‌మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్:

హాల్‌మార్క్ చేసిన బంగారు ఆభరణాల మూడవ నాణ్యత సంకేతం ఆభరణంపై ఉన్న ఆరు-అంకెల ఆల్ఫాన్యూమరిక్ కోడ్. ఈ కోడ్ – హాల్‌మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ (HUID) నంబర్ అని కూడా పిలుస్తారు. ఇది ప్రతి ఆభరణానికి ప్రత్యేకంగా ఉంటుంది.

కస్టమర్‌లు ఈ ఆల్ఫాన్యూమరిక్ కోడ్‌ను BIS Care Appలో ధృవీకరించవచ్చు. వినియోగదారులు తమ మొబైల్ ఫోన్‌లో BIS కేర్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఆభరణాల ఆల్ఫాన్యూమరిక్ కోడ్‌ను ధృవీకరించడానికి/ఆభరణాల స్వచ్ఛతను ధృవీకరించడానికి BIS కేర్ యాప్‌లో ‘వెరిఫై HUID’ ఫీచర్‌ను ఉపయోగించవచ్చు.

పై మూడు ఉంటే అప్పుడు ఆ బంగారం నాణ్యతమైనది అని గుర్తించాలి.

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles