Thursday, April 25, 2024
HomeHow ToPPO Number: ఈపీఎఫ్ సబ్‌స్క్రైబర్లు పీపీవో నెంబర్ తెలుసుకోవడం ఎలా..?

PPO Number: ఈపీఎఫ్ సబ్‌స్క్రైబర్లు పీపీవో నెంబర్ తెలుసుకోవడం ఎలా..?

How To Get PPO Number: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO) ఒక ఉద్యోఫీ పదవి విరమణ చెందే సమయంలో ప్రతి ఉద్యోగికి పెన్షన్ పేమెంట్ ఆర్డర్(పీపీఓ) వివరాలకి సంబంధించిన లేఖను పంపిస్తుంది. అంటే ఈపీఎస్ పరిధిలోకి వచ్చే పెన్షనర్లకు ప్రత్యేకమైన పీపీఓ నెంబర్‌ను కేటాయిస్తుంది. ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్ డిస్బర్స్‌మెంట్ కోసం దీనిని అందిస్తుంది.

పీపీవో నెంబర్ ఎందుకు అవసరం?

సెంట్రల్ పెన్షన్ పెన్షన్ అకౌంటింగ్ ఆఫీస్(CPAO)తో ఏదైనా కమ్యూనికేషన్ కోసం ఇది ఒక రిఫరెన్స్ నెంబర్. పీపీవో నెంబర్ పెన్షన్ పొందడానికి సహకరిస్తుంది. ప్రతి సంవత్సరం లైఫ్ సర్టిఫికెట్ సమర్పించేటప్పుడు ఈ పీపీవో నెంబర్‌ను పేర్కొనడం ముఖ్యం. పదవీ విరమణ తర్వాత పెన్షన్ పొందే ఉద్యోగులు ఈ నెంబర్‌ను తప్పకుండా తెలుసుకోవడం చాలా ముఖ్యం.

(ఇది కూడా చదవండి: ఈడీఎల్ఐ స్కీమ్ కు ఎవరు అర్హులు, దానివల్ల కలిగే ప్రయోజనాలేమిటి?)

పెన్షన్ కోసం దరఖాస్తు చేసే సమయంలో లైఫ్ సర్టిఫికెట్ సమర్పించేటప్పుడు పీపీవో నెంబర్ అవసరం. పీపీవో నెంబర్ తెలియకుంటే పీఎఫ్ ఖాతాకు ఒక బ్యాంకు శాఖ నుంచి మరో బ్యాంకుకు బదలీ చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి.

పెన్షన్ పేమెంట్ ఆర్డర్ నెంబర్ 12 అంకెలు కలిగిన నెంబర్. ఇందులో మొదటి అయిదు అంకెలు పీపీవో జారీ చేసే అథారిటీ కోడ్‌ను, తర్వాత రెండు అంకెలు – నెంబర్ జారీ చేసిన సంవత్సరాన్ని, ఆ తర్వాత నాలుగు అంకెలు పీపీవో సీక్వెన్షియల్ నెంబర్, చివరి అంకె కంప్యూటర్ చెక్ కోడ్‌ను తెలియజేస్తాయి.

ఈపీఎఫ్ సబ్‌స్క్రైబర్లు పీపీవో నెంబర్ తిరిగి పొందడం ఎలా..?

  • మొదట www.epfindia.gov.inకు లాగిన్ చేయండి
  • ఇప్పుడు ఆన్‌లైన్ సర్వీస్ కింద, పెన్షనర్ పోర్టల్‌పై క్లిక్ చేయండి
  • ఆ తర్వాత ‘వెల్‌కమ్ టు పెన్షనర్స్ పోర్టల్‌ ఓపెన్ అవుతుంది.
  • ఇప్పుడు పేజీ కుడి వైపున పేర్కొన్న మీ PPO నంబర్‌ను తెలుసుకోండి(Know your PPO number)ని క్లిక్ చేయండి
  • ఆ తర్వాత మీ బ్యాంక్ ఖాతా నంబర్ లేదా PF నంబర్‌ను నమోదు చేయండి. సంబంధిత సమాచారాన్ని నమోదు చేసిన తర్వాత మీరు మీ PPO నంబర్, అలాగే మీ మెంబర్ ID మరియు పెన్షన్ రకాన్ని తెలుసుకుంటారు. ఇక్కడ పెన్షన్ స్టేటస్‌ను తెలుసుకోవచ్చు.
- Advertisement -

ఈపీఎస్ వల్ల కలిగే లాభం ఏమిటి?

ఈపీఎఫ్‌లో ఓ భాగం ఈపీఎస్. ఈపీఎఫ్ఓలో సభ్యులైన ఉద్యోగులకు వర్తిస్తుంది. దీంతో ప్రభుత్వ ఉద్యోగుల వలె ప్రయివేటు రంగంలోని ఉద్యోగులు కూడా పదవీ విరమణ తర్వాత నెలవారీ పెన్షన్ పొందవచ్చు. ఉద్యోగి మరణించిన తర్వాత కూడా నామినీ ఈ పెన్షన్ పొందవచ్చు. ఉద్యోగి, సంస్థ 12 శాతం చొప్పున ఉద్యోగి వేతనానికి సమానమైన మొత్తాన్ని ప్రతి నెల ఈపీఎప్‌లో జమ చేస్తారు. సంస్థ వాటా 12 శాతంలో 8.33 శాతం ఈపీఎస్‌కు వెళ్తుంది. మిగతా 3.67 శాతం ఈపీఎఫ్‌కు చేరుతుంది.

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles