Tuesday, March 19, 2024
HomeHow ToDharani Portal: తెలంగాణ ధరణి పోర్టల్‌లో భూ రిజిస్ట్రేషన్ కోసం స్లాట్‌ బుక్ చేసుకోవడం ఎలా..?

Dharani Portal: తెలంగాణ ధరణి పోర్టల్‌లో భూ రిజిస్ట్రేషన్ కోసం స్లాట్‌ బుక్ చేసుకోవడం ఎలా..?

Land Registration Slot Booking Process in Dharani Portal Telugu: తెలంగాణ ప్రభుత్వం రైతులు, ఇతర ప్రజలు వ్యవసాయ భూముల అమ్మకాలు కొనుగోలు కోసం ధరణి పోర్టల్ లాంచ్ చేసిన సంగతి మనకు తెలిసిందే. ఈ పోర్టల్ ద్వారా కేవలం అమ్మకాలు, కొనుగోలు మాత్రమే కాకుండా ఇతర సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి. మనం ఇప్పుడు భూ రిజిస్ట్రేషన్ కోసం స్లాట్‌ను ఎలా బుక్ చేసుకోవాలి అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

(ఇది కూడా చదవండి: సాదాబైనామా, సెటిల్ మెంట్ డీడ్ & సేత్వార్ పహాణి అంటే ఏమిటి?)

మనం భూముల కొనుగోళ్లు, అమ్మకాలూ జరపాలన్న ముందుగా మనం స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. అందుకోసం తప్పనిసారిగా మనకు ఒక యూజర్ అకౌంటు కలిగి ఉండాలి. దాని కోసం New User Please Sign Up here అనే ఆప్షన్ క్లిక్ చేసి మీ పేరు, మొబైల్ నెంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేసి అకౌంట్ ని క్రియేట్ చేసుకోవచ్చు.

ధరణి పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ కోసం స్లాట్‌ బుక్ చేసుకోవడం ఎలా..?

  • మొదట ధరణి అధికారిక వెబ్‌సైట్‌ ఓపెన్ చేయండి.
  • ఆ తర్వాత Slot Booking For Citizens అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు ఇంత ముందు క్రియేట్ చేసిన అకౌంట్ ద్వారా లాగిన్ అవ్వాలి.
  • ఇప్పుడు మీరు Application for Registration(Gift & Sale) అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.
  • ఆ తర్వాత Nature of Deed, Nature of Sub-Deed, PPB NUmber వివరాలు ఎంటర్ చేశాక మీకు అక్కడ మీ భూమికి సంబందించిన వివరాలు వస్తాయి.
  • ఆ తర్వాత మీరు అమ్మే లేదా బహుమానంగా ఇచ్చే సర్వే నెంబర్ ని ఎంచుకొని ఆ భూమి 4 హద్దులు ఎంచుకొని proceed అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.
  • ఆ తర్వాత మీ ఆధార్ కార్డ్ నెంబర్, పాన్ కార్డ్ నెంబర్ లేదా ఫామ్ 60, మీ పేరు, అడ్రెస్, మీ కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేయాలి.
  • అలాగే, ఎవరికి మీరు అమ్ముతున్నారో లేదా బహుమానంగా ఇస్తున్నారో వారి వివరాలు కూడా సమర్పించాలి.
  • ఆ తర్వాత మీకు పేమెంట్ పేజీలో డబ్బులు కట్టిన తర్వాత మీకు ఒక Application Txn Number వస్తుంది.
  • దానిని మనం సేవ్ చేసుకున్న తర్వాత స్లాట్ బుకింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి Application Txn Number ఎంటర్ చేసి మనం ఏ రోజున తహశీల్దార్ కార్యాలయానికి వెళ్ళాలి అనుకుంటున్నామో ఆ రోజున స్లాట్ బుకింగ్ చేసుకోవాలి.
  • అయితే, ఈ సదుపాయం ధరణి TS పోర్టల్‌లో నమోదు చేసుకున్న పౌరులకు మాత్రమే వర్తిస్తుంది.
- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles